ETV Bharat / international

పురుషుడుకి రుతుస్రావం.. కంగుతిన్న డాక్టర్లు.. చివరికి ఏమైందంటే.. - intersex person

33 ఏళ్ల పురుషుడికి రుతుస్రావం అవుతున్న వింత ఘటన తాజాగా చైనాలో వెలుగులోకి వచ్చింది. అతడికి నిర్వహించిన వరుస వైద్యపరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడడం వల్ల డాక్టరు షాక్​ అయ్యారు. చివరికి అతడు తీసుకున్న నిర్ణయం కూడా అంతే అనూహ్యంగా ఉంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Shocking! Man finds out he has ovaries, uterus after 20 yrs

author img

By

Published : Jul 11, 2022, 10:41 PM IST

మూత్రంలో రక్తం రావడం.. తరచూ కడుపు నొప్పి.. ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. అపెండిక్స్ అయ్యుండొచ్చని వైద్యులు శస్త్రచికిత్స చేసినా.. ఫలితం లేదు. 33 ఏళ్లు వచ్చినా ఆ వ్యక్తిని ఆ బాధలు వేధిస్తుండటంతో.. పూర్తిస్థాయి పరీక్షలు చేసిన వైద్యులు రిపోర్టులు చూసి షాక్‌కు గురయ్యారు. అతడి కడుపు నొప్పి, రక్తస్త్రావానికి కారణం 'రుతుస్రావం' అని గుర్తించారు. ఆ వ్యక్తికి స్త్రీ సెక్స్ క్రోమోజోమ్‌లు ఉన్నట్లు కనుగొన్నారు.

సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ కథనం ప్రకారం.. చైనాకు చెందిన లీ డాంగ్‌కు (పేరు మార్చాం) మూత్రవిసర్జన సమయంలో సమస్యలు ఏర్పడగా యుక్త వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే అప్పటి నుంచి లీకి.. మూత్ర విసర్జన సమయంలో రక్తం వస్తోంది. తరచూ కడుపునొప్పితో బాధపడేవాడు. గతంలో నాలుగు రోజులపాటు తీవ్ర పొత్తికడుపు నొప్పి వేధించడంతో వైద్యులు అపెండిక్స్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఆ సమస్య అలాగే వెంటాడింది. దీంతో గతేడాది పూర్తిస్థాయిలో అతడిని పరీక్షించిన వైద్యులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ వ్యక్తికి స్త్రీ క్రోమోజోమ్‌లు ఉన్నాయని గుర్తించారు. రక్తస్రావం అనారోగ్యం కారణంగా జరుగుతోంది కాదని, అది రుతుస్రావం అని తేల్చారు. కడుపునొప్పికి కారణం కూడా ఇదేనని పేర్కొన్నారు.

లీ డాంగ్‌ పూర్తిస్థాయిలో పురుషుడు కాదని.. పురుష, స్త్రీ క్రోమోజోమ్‌ కలగలిసిన 'ఇంటర్‌సెక్స్‌' అని వైద్యులు వెల్లడించారు. లీకి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్య పరీక్షలో గుర్తించారు. పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయి. స్త్రీ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఓ ఆరోగ్యకరమైన మహిళల మాదిరిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడిని ఇంటర్‌సెక్స్‌గా డాక్టర్లు గుర్తించారు.

అయితే, 30ఏళ్లకుపైగా పురుషుడిగా జీవించిన లీ డాంగ్‌ తాను ఇంటర్‌సెక్స్‌ అని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించాల్సిందిగా వైద్యులను అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా లీకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. అతడు కోలుకుంటున్నట్లు తెలిపారు. అతడి ఆరోగ్యం దృష్ట్యా, మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకే శస్త్రచికిత్స నిర్వహించి స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించినట్లు పేర్కొన్నారు డాక్టర్లు.

ఇవీ చదవండి: వచ్చే ఏడాది చైనాను దాటి మనమే నెం.1.. ఏ విషయంలో అంటే?

సంక్షోభంలో ఉన్న శ్రీలంక కోసం భారత సైన్యం.. నిజమేనా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.