ETV Bharat / international

అదే పనిగా TV చూసిన కొడుకు.. తల్లి చేసిన పనికి అందరూ షాక్​! - టీవీకి బానిసైన చైనా బాలుడు

అదే పనిగా టీవీ చూస్తున్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు అతడి తల్లిదండ్రులు భిన్నంగా ఆలోచించారు. రాత్రంతా బాలుడిని టీవీ ముందే కూర్చొబెట్టి బలవంతంగా చూపించారు. చైనాలో జరిగిన ఈ వ్యవహారం కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల పెంపకంపై చర్చకు దారితీసింది.

china boy
చైనా బాలుడు
author img

By

Published : Nov 28, 2022, 8:13 AM IST

తమ పిల్లలకు క్రమశిక్షణ అలవర్చేందుకు తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తుంటారు! అదే పనిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు చైనాకు చెందిన ఓ జంట మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. రాత్రంతా కూర్చొబెట్టి అతనితో బలవంతంగా టీవీ చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో నివసిస్తోన్న దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల తల్లిదండ్రులు ఓ పనిమీద బయటకు వెళ్తూ.. హోంవర్క్‌ పూర్తి చేసుకుని, రాత్రి 8.30కల్లా నిద్రపోవాలని బాలుడికి సూచించారు. వారు ఆలస్యంగా తిరిగిరాగా.. అతను హోంవర్క్‌ పక్కనపెట్టేసి, అప్పటికీ టీవీ చూస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను నిద్రకు ఉపక్రమించాడు. దీంతో ఆగ్రహించిన తల్లి.. అతన్ని దారిలో పెట్టాలని చూసింది.

కుమారుడిని నిద్రలేపి తీసుకొచ్చి బలవంతంగా టీవీ ముందు కూర్చొబెట్టింది. అతను నిద్రలోకి జారుకోకుండా ఇద్దరు ఓ కంట కనిపెట్టారు. మొదట్లో ఆసక్తిగానే టీవీ చూసిన బాలుడు.. క్రమంగా అలసటతో కూర్చోలేకపోయాడు. మెలకువగా ఉండటం కష్టంగా మారింది. చివరకు ఏడుపు మొదలుపెట్టాడు. నిద్రపోతానంటూ వేడుకున్నాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతన్ని ఉదయం 5 వరకు టీవీ చూపెడుతూ.. నిద్రపోనివ్వలేదని ఓ వార్తాసంస్థ తెలిపింది.

అయితే, తాము చేసిన పని అతనిపై సానుకూల ప్రభావం చూపిందని తల్లి చెప్పడం గమనార్హం. మరోవైపు.. ఈ వ్యవహారం కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తల్లిదండ్రుల పెంపకంపై చర్చకు దారితీసింది. ఇది చాలా కఠినమైన శిక్ష అంటూ పలువురు స్పందించారు. 'కేఎఫ్‌సీ ఇష్టపడే నా బిడ్డకు వరుసగా మూడురోజులు అదే తినిపించేసరికి.. ఇప్పుడతనికి దానిపై ఆసక్తి పోయింది' అని మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.