ETV Bharat / international

భారత నిపుణులు, విద్యార్థులకు చైనా తీపికబురు.. వీసాలకు ఓకే! - COVID visa ban

చైనాలో పనిచేసి వృత్తినిపుణులు, విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. కరోనా కారణంగా ఆ దేశంలో కఠిన వీసా ఆంక్షల అమలు నేపథ్యంలో రెండేళ్లుగా.. భారత్​లోనే చిక్కుకుపోయినవారికి చైనాకు తిరిగొచ్చేందుకు వీసాలను అందించనున్నట్లు బీజింగ్ ప్రకటించింది.

COVID visa ban
china visa open for india 2022
author img

By

Published : Jun 14, 2022, 11:00 PM IST

తమ దేశంలో పనిచేసే భారత వృత్తి నిపుణులు, వారి కుటుంబ సభ్యులకు తీపికబురు చెప్పింది చైనా. కరోనా కారణంగా స్వదేశంలో చిక్కుకుపోయిన వారికి వీసాలను అందించనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటే చైనా యూనివర్సిటీల్లో చదివే భారతీయ విద్యార్థులు తిరిగి తమ దేశానికి వచ్చేందుకు అనుమతించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది.

ఈ మేరకు దాదాపు రెండేళ్ల తర్వాత కొవిడ్-19 వీసా విధానాన్ని సోమవారం అప్డేట్ చేసింది భారత్​లోని చైనా రాయబార కార్యాలయం. తమ దేశంలో పనిచేసే అన్ని రంగాల్లోని విదేశీయులు, వారి కుటుంబసభ్యులు తిరిగి చైనా వచ్చేందుకు వీసా దరఖాస్తులను ఆమోదించనుంది. దీంతో 2020 నుంచి భారత్​లోనే చిక్కుకుపోయిన వందలాది మంది భారత వృత్తి నిపుణులకు ఉపశమనం దక్కనుంది.

ఇదీ చూడండి: క్వారంటైన్​ నుంచి 50రోజులకు రిలీజ్.. కానీ చుట్టూ కంచె వేసి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.