ETV Bharat / international

China Air Jet Emergency Landing : విమానం ఇంజిన్​లో మంటలు.. క్యాబిన్​లోకి పొగ.. తొమ్మిది మందికి గాయాలు - చైనా ఎయిర్ జెట్ ఇంజిన్ పొగలు

China Air Jet Emergency Landing : సింగపూర్​లో చైనాకు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయింది. విమానం ఇంజిన్​లో మంటలు చెలరేగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. విమానాన్ని ల్యాండ్​ చేసి ప్రయాణికులను కిందకు దింపారు. ఈ క్రమంలో తొమ్మిది మంది గాయపడ్డారు.

china-air-jet-emergency-landing-in-singapore-jetliner-catches-fire-several-passengers-injured
చైనా విమానం ఇంజిన్​లో మంటలు పలువురికి గాయాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 12:02 PM IST

Updated : Sep 11, 2023, 12:28 PM IST

China Air Jet Emergency Landing : చైనాకు చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 146 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. వాటి పొగలు క్రమంగా క్యాబిన్​లోకి వ్యాపించాయి. దీంతో సింగపూర్​లోని చాంగి విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్​ చేశారు సిబ్బంది. అనంతరం ప్రయాణికులను కిందకు దింపారు. ఈ క్రమంలోనే తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన A320 నంబర్​ గల విమానం.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్​డూ నగరం నుంచి వచ్చింది. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది అత్యవరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులు కిందకు దింపారు. ఉక్కిరిబిక్కిరి చేసే పొగ, హడావుడిగా ప్రయాణికులను కిందకు దింపే క్రమంలో 9 మందికి గాయాలయ్యాయి.

china-air-jet-emergency-landing-in-singapore-jetliner-catches-fire-several-passengers-injured
విమానంలో పొగలు అలుముకున్న దృశ్యం

"విమానం ఫార్వర్డ్ కార్గో హోల్డ్​, మరుగుదొడ్డిలోకి పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్​ చేశాం. ప్రయాణికులు ఆందోళన చెందకుండా ముందే వారిని హెచ్చరించాం." అని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ల్యాండింగ్​ అనంతరం మంటలు అర్పివేశారు సహాయక సిబ్బంది. మెకానికల్​ సమస్య కారణంగానే ఈ ప్రమాదం తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు చైనా అధికారులు. దీనిపై మరింత విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.

విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. ఇంజిన్​లో మంటలు.. గాల్లో చక్కర్లు కొడుతూ..
Bird Collision With Plane : కొద్దిరోజుల క్రితం దుబాయ్ ఎయిర్​లైన్​కు చెందిన ఓ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమాన ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. ఇంజిన్​లో సమస్యను గుర్తించిన పైలట్లు.. కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటీసీ (ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోలర్​)కి సమాచారం ఇచ్చారు. అనంతరం ఏయిర్​పోర్టు సమీపంలోకి వచ్చిన విమానం.. మంటలతో కొద్ది సేపు గాల్లో చక్కర్లు కొట్టింది.

విమానంలో మంటలు అంటుకున్నాయన్న సమాచారంతో త్రిభువన్​ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఫైర్​ ఇంజిన్​లను స్పాట్​కు తరలించింది. అయితే, ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని పైలట్లు తెలిపారు. అనంతరం మరో ఇంజిన్​ సహాయంతో విమానం దుబాయ్‌లో సేఫ్​ ల్యాండింగ్ అయింది. నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 160 మంది ప్రయాణికులతో ఫ్లైదుబాయ్‌ సంస్థకు చెందిన 576 (బోయింగ్ 737-800) విమానం.. దుబాయ్​కు బయలుదేరింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం.. పైలట్​, చిన్నారికి తీవ్ర గాయాలు.. లైవ్ వీడియో..

Fire accident: లారీ ఇంజిన్​లో మంటలు... పేలిన 100 గ్యాస్​ సిలిండర్ల

Last Updated : Sep 11, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.