ETV Bharat / international

నాలుగేళ్ల చిన్నారికి విస్కీ.. అమ్మ, నాయనమ్మ జైలుకు! - అమెరికా లూసియానా వార్తలు

Child Dies Drinking Whiskey: ఆ చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఇంటివాళ్లే ఆమెకు మృత్యువుగా మారారు. కన్నతల్లి ఎదుటే నాయనమ్మ బలవంతంగా ఆమెకు విస్కీ తాగించింది. కళ్ల ముందు ఈ దారుణం జరుగుతున్నా తల్లి చూస్తూ ఊరుకుంది. చివరకు ఆ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

Child Dies Drinking Whiskey
విస్కీ తాగి చిన్నారి మృతి
author img

By

Published : Apr 23, 2022, 4:31 AM IST

Child Dies Drinking Whiskey: ఓ నాలుగేళ్ల చిన్నారికి ఆమె నాయనమ్మ బలవంతంగా విస్కీ తాగించింది. ఆ సమయంలో ఆమె తల్లి అక్కడే ఉన్నా చూస్తూ ఊరుకోవడం వల్ల ఆ చిన్నారి మృతిచెందింది. ఈ దుర్ఘటన అమెరికాలోని లూసియానా రాష్ట్రం బాటన్ రౌగ్​ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితులు రోక్సాన్నే రికార్డ్​ (53), కాద్జా రికార్డ్​గా (29) గుర్తించారు పోలీసులు.

చిన్నారి చైనా రికార్డ్​ (4) శరీరంలో బ్లడ్​ అల్కాహాల్​ లెవెల్​ 0.680 శాతం ఉన్నట్లు పోస్ట్​మార్టంలో వెల్లడైందని అధికారులు తెలిపారు. పెద్దల్లో ఇది అత్యధికంగా 0.08 శాతం ఉంటుందని.. దీంతో పోలిస్తే చిన్నారి శరీరంలో ఎనిమిది రెట్లు ఎక్కువ ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : శత్రు దేశాల అధినేతల 'ప్రేమ లేఖలు'- అసలు లక్ష్యం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.