ETV Bharat / international

Burning Man Festival : బురద ఎడారిలో వేల మంది అవస్థలు.. టాయిలెట్లు లేక నరకం.. హాలీవుడ్​ నటులు 4కి.మీ నడిచి.. - బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ 2023

Burning Man Festival News : అమెరికాలోని నెవాడలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు వెళ్లిన వారికి ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. వేడుక జరుగుతున్న బ్లాక్‌రాక్ ఎడారిలో వర్షం పడటం వల్ల భారీగా బురద ఏర్పడింది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉండటం వల్ల అందులో చిక్కుకున్న వారు నరకయాతన పడుతున్నారు. బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు వెళ్లి చిక్కుకున్న వారిలో హాలీవుడ్‌ నటులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది

Burning Man Festival News
Burning Man Festival News
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 2:48 PM IST

Burning Man Festival News : బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న అమెరికాలోని నెవాడ.. బ్లాక్‌రాక్‌ ఎడారిలో గత శుక్రవారం 2.5 సెంటీమీటర్ల మేర వర్షం కురవడం వల్ల నేల బురద మయంగా మారిపోయింది. ఈ నరకం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రజలు నడుచుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణం మొదలుపెట్టారు. వీరిలో కమెడియన్‌ క్రిస్‌రాక్‌, డీజే డిప్లో వంటి హాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వీరు దాదాపు నాలుగు గంటలపాటు బురదలో నడిచారు. చివరికి ఓ అభిమాని వీరిని తన పికప్‌ ట్రక్‌లో ఎక్కించుకునేందుకు ముందుకు రావడం వల్ల బయటపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా డీజే డిప్లో తన ఇన్‌స్టాలో షేర్​ చేశారు.

బురదలోనే నడుచుకుంటూ..
Burning Man Festival Nevada Desert : బ్లాక్‌రాక్‌ ఎడారిలోని బురదపై ప్రయాణించేందుకు ప్రస్తుతం వాహనాలను నిర్వాహకులు అనుమతించడం లేదు. దీంతో కొందరు సుమారు 6 మైళ్లు బురదలోనే నడుచుకుంటూ వెళ్లేందుకు సిద్ధపడ్డారు. బ్లాక్‌ రాక్‌ ఎడారి బురదలో వేల మంది చిక్కుకుపోయిన విషయాన్ని శ్వేత సౌధం కూడా ధ్రువీకరించింది.

Burning Man Festival News
బురదమయంగా మారిన బ్లాక్‌రాక్‌ ఎడారి

సెల్​ఫోన్​, వైఫై సౌకర్యాలు..
Burning Man Festival Location : బర్నింగ్‌ మ్యాన్‌ నిర్వాహకుల సూచనలను అనుసరించి అక్కడే ఉండిపోయిన వారికి సెల్‌ఫోన్‌, వైఫై సౌకర్యాలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల పార్టీకి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. నడుచుకుంటూ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నవారిని ఎక్కించుకోవడానికి కొన్ని బస్సులను నెవాడ సమీపంలోని గెర్లాచ్‌ వద్ద సిద్ధంగా ఉంచారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు నెలకొంటే స్పందించేందుకు వీలుగా వీలైనన్ని ఫోర్‌-వీల్‌ డ్రైవ్‌ వాహనాలను, ఆల్‌ టెర్రైన్‌ టైర్లను సిద్ధంగా ఉంచాలని నిర్వాహకులు కోరారు.

కొందరు అలా.. మరికొందరు ఇలా..
Burning Man Festival Nevada Us : బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న వారిలో కొందరికి అది పీడకలలా మారింది. అయితే మరికొందరు మాత్రం బురద ఉన్నప్పటికీ వేడుకను చాలా ఆస్వాదించినట్లు చెప్పారు.

Burning Man Festival News
బ్లాక్‌రాక్‌ ఎడారిలో చిక్కుకున్న వేలాది మంది ప్రజలు

భారీ మనిషి బొమ్మ దహనం..
Burning Man Festival What Is It : బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌ ఏటా బ్లాక్‌రాక్‌ ఎడారిలో జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌ చివరి రోజున భారీ మనిషి బొమ్మను దహనం చేస్తారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. ఈ ఏడాది ఇన్ని ఇబ్బందులున్నా.. సోమవారం రాత్రి వాతావరణం అనుకూలిస్తే మనిషి బొమ్మను దహనం చేసే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.