ETV Bharat / international

60 మందిని చంపిన దుండగులు.. మిలిటరీ దుస్తుల్లో వచ్చి.. - బుర్కిన ఫాసో అల్లర్లు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన దుండగులు 60 మందిని చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

burkina faso coup
burkina faso coup
author img

By

Published : Apr 24, 2023, 4:42 PM IST

Updated : Apr 24, 2023, 7:02 PM IST

మిలిటరీ యూనిఫారంలో వచ్చిన కొందరు వ్యక్తులు 60 మంది పౌరులను చంపేశారు. ఈ ఘటన బుర్కినా ఫాసో అనే పశ్చిమ ఆఫ్రికా దేశంలో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని బుర్కినా ఫాసో అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబర్​లో రెండో సారి జరిగిన తిరుగుబాటులో.. బుర్కినా ఫాసో ఆర్మీ అధికారి ఆ దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, పౌరుల హత్యలు పెరిగాయయని మానవ హక్కుల సంఘాల ఆరోపిస్తున్నాయి. భద్రతా దళాలే ఈ ఘటనలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో భద్రత దళాల చేతిలో ఏడుగురు చిన్నారులు చనిపోయారన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఈ చట్టవిరుద్ధ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

అల్​ ఖైదా, ఇస్లామిక్​ స్టేట్​తో సంబంధమున్న కొంత మంది జిహాదీలు.. ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న దేశంలో అల్లకల్లోలం సృష్టించి.. విభజించారు. దీంతో గత ఏడాది రెండు సార్లు ఘర్షణలకు దారితీశాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని చాలా ప్రాంతాలు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ ఆధీనంలో ఉన్నాయి. ఈ సంస్థలు గత ఆరు సంవత్సరాలలో వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. వీరి కారణంగా ఇప్పటి వరకు రెండు మిలియన్ల మంది.. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళ్లారు. ప్రభుత్వాలు వీటిని నిర్మూలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. అవి సఫలం కావట్లేదు.

ఉగ్రవాదుల దాడుల్లో 44 మంది మృతి..
ఇదే బుర్కినా ఫాసోలో కొద్ది రోజుల క్రితం జిహాదీలు జరిపిన దాడుల్లో సుమారు 44 మంది మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామాలే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. సెనో ప్రావిన్స్‌లోని కౌరకౌ, టోండోబి గ్రామాలపై జిహాదీలు దాడి చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫ్రికాలో పేలిన బాంబు.. 10 మంది మృతి.. పలువురికి గాయాలు..
బుర్కినా ఫాసోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. బౌగురు గ్రామంలో గుండా ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి ఓ మైనింగ్​ గనిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సహాయ చర్యలు చేపట్టిన సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : Apr 24, 2023, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.