ETV Bharat / international

Beer From Urine: మురుగు, మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?

Beer From Urine: మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడి తాగే వాటిలో బీర్ ఒకటి! అయితే అది మూత్రం, మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో కూడా తయారవుతుందని తెలుసా? సింగపూర్​లో ఇలా తయారైన బీర్​కు చాలా క్రేజ్​ ఉంది. దానిని మీరూ ట్రై చేయాలనుకుంటున్నారా?

Beer From Urine
Beer From Urine
author img

By

Published : May 28, 2022, 5:28 AM IST

Beer From Urine: మద్యం తయారీలో సింగపూర్‌ కొత్తపుంతలు తొక్కుతోంది. ఆ దేశంలో రూపొందుతున్న ఓ బీరు ప్రస్తుతం అనేక దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇతర బీర్ల లాగే కనిపిస్తూ, అలాంటి రుచినే అందిస్తున్నప్పటికీ.. 'న్యూబ్రూ' బీరు మాత్రం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎందుకంటే దాన్ని మూత్రంతోపాటు మురుగు నుంచి శుద్ధి చేసిన నీటితో తయారు చేస్తున్నారు. మూత్రం, మురుగును శుద్ధిచేసి తీసిన నీటికి 'నీవాటర్‌' అని పేరు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి శుద్ధి చేస్తోన్న ఈ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చు. ఈ నీరు సింగపూర్‌ బ్రాండ్‌ కూడా.

'న్యూబ్రూ' బీరును తయారు చేసేందుకు 95శాతం నీవాటర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఈ బీరు తయారీలో జర్మన్‌ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతోపాటు దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌ (ఎస్​ఐడబ్ల్యూడబ్ల్యూ)తో కలిసి నేషనల్ వాటర్ ఏజెన్సీ (పీయూబీ), స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థలు ఈ బ్రాండ్‌ను ఏప్రిల్ 8న మార్కెట్‌లోని విడుదల చేయనున్నారు. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయోగం చేశామని ఎస్‌డబ్ల్యూడబ్ల్యూ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ర్యాన్‌ యుయెన్‌ తెలిపారు.

ఇదీ చూడండి: ఈ హోటల్ నిర్మాణం మొత్తం ఉప్పుతోనే.. ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.