Biden Impeachment 2023 : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తి.. రిపబ్లికన్ పార్టీ ఒత్తిడికి తలొగ్గారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అనుమతించారు. అధికారిక అభిశంసన విచారణ ప్రారంభించాలని హౌస్ కమిటీని ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్.. తన కుమారుడు హంటర్ విదేశీ వ్యాపార లావీదేవీలను దాచిపెట్టారని ఈ సందర్భంగా మెక్‌కార్తి ఆరోపించారు.
డెమొక్రాట్ పార్టీపై శ్వేతసౌధం ఫైర్..
Mccarthy Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణకు అనుమతించడంపై శ్వేతసౌధం మండిపడింది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అత్యంత దారుణమైన రాజకీయాలు చేస్తోందని.. విమర్శించింది. హౌస్ ఆఫ్ రిపబ్లికన్లు 9నెలల నుంచి అధ్యక్షుడిని విచారిస్తున్నారని, అయినా తప్పు జరిగినట్లు ఆధారాలు చూపలేకపోయారని శ్వేతసౌధం ప్రతినిధి ఇయన్ సామ్స్ ట్వీట్ చేశారు.
-
'Absolutely Shocking': Impeachment Experts Say Biden Inquiry May Be Weakest in US History
— Ian Sams (@IanSams46) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
via @TIME https://t.co/oTSvxgXVEc
">'Absolutely Shocking': Impeachment Experts Say Biden Inquiry May Be Weakest in US History
— Ian Sams (@IanSams46) September 13, 2023
via @TIME https://t.co/oTSvxgXVEc'Absolutely Shocking': Impeachment Experts Say Biden Inquiry May Be Weakest in US History
— Ian Sams (@IanSams46) September 13, 2023
via @TIME https://t.co/oTSvxgXVEc
అభిశంసనకు రిపబ్లికన్లు డిమాండ్..
Donald Trump Impeachment : డెమొక్రాట్ పార్టీకి చెందిన బైడెన్ కుమారుడు హంటర్ ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సంస్థ నుంచి బైడెన్‌లకు ముడుపులు ముట్టాయని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ అవకాశంగా తీసుకుని బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డెమొక్రాట్లు రెండుసార్లు అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టారు. అందుకు ప్రతీకారంగా బైడెన్‌ను అభిశంసించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే రెండుసార్లు అభిశంసన తీర్మానానికి ఎదుర్కొన్నారు. రెండు సార్లు.. డొనాల్డ్ ట్రంప్ అభిశంసన నుంచి గట్టెక్కారు.
డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల చేతిలోకి స్పీకర్ పదవి..
ఈ ఏడాది జనవరిలో అమెరికా ప్రతినిధుల స్పీకర్ పదవి డెమొక్రాట్ల నుంచి రిపబ్లికన్ల చేతిలోకి వచ్చింది. ఈ క్రమంలో డెమొక్రాట్ పార్టీ నేత నాన్సీ ఫెలోసి నుంచి కెవిన్ మెక్‌కార్తి స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అమెరికాలో దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు.
భారత్‌కు వచ్చిన బైడెన్
ఇటీవలే జీ20 సమావేశాలకు భారత్‌కు వచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారత్ నుంచి నేరుగా వియత్నాంకు బయలుదేరారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Biden Convoy Driver Detained : దిల్లీలో బైడెన్ డ్రైవర్ అరెస్ట్! అలా చేయడమే కారణం!!
తుమ్మితే ఊడిపోయే అమెరికా స్పీకర్ పదవి.. మెకార్థీ అంతలా లొంగిపోయారా?