ETV Bharat / international

ఉక్రెయిన్​కు అమెరికా సాయం.. భారీ మిలిటరీ ప్యాకేజ్​ను ప్రకటించిన బైడెన్

author img

By

Published : Apr 14, 2022, 8:34 AM IST

US aid to Ukraine: ఉక్రెయిన్​కు సాయం అందించేందుకు కొత్తగా 800 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్​​ ఆమోదించారు. ఈ ప్యాకేజీలో ఉక్రెయిన్​కు అవసరమైన అత్యంత ప్రభావంతమైన సాయుధ వ్యవస్థలను అందిస్తున్నట్లు ఆయన​ చెప్పారు. కాగా, బైడెన్​ ప్రకటించిన ఈ భారీ సాయానికి ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ కృతజ్ఞతలు తెలిపారు.

US aid to Ukraine
US aid to Ukraine

US Aid To Ukraine: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని ఇంకా కొనసాగిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. ఉక్రెయిన్​పై భీకర దాడులను రష్యా ఆపట్లేదు. మరోవైపు ఉక్రెయిన్​ కూడా రష్యాను దీటుగానే ఎదుర్కొంటోంది. 45 రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్దంలో ఉక్రెయిన్​కు ఇప్పటివరకు అమెరికా సహా ప్రపంచ దేశాలు అండగా నిలిచాయి. తాజాగా మరోసారి సాయం అందించనున్నట్లు అమెరికా ప్రకటించింది. 800 మిలియన్​ డాలర్లు విలువ చేసే మిలిటరీ ప్యాకేజీని అందించనుంది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​ పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ వెల్లడించారు. ఈ ప్యాకేజీలో భాగంగా అదనపు హెలీకాప్టర్లు, ఉక్రెయిన్​ సాయుధ సిబ్బంది క్యారియర్లు, తీరప్రాంత రక్షణకు ఉపయోగించే నావికా డ్రోన్ నౌకలతో పాటు రసాయన, జీవ, అణు, రేడియోలాజికల్ దాడులలో సైనికులను రక్షించడానికి ఉపయోగించే పరికరాలను కూడా ఉక్రెయిన్​కు అందిస్తామని​ తెలిపారు.

"తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేపట్టే అవకాశం ఉంది కాబట్టీ కొత్త ప్యాకేజీలో అత్యంత ప్రభావవంతమైన ఆయుధ వ్యవస్థలున్నింటినీ అందిస్తున్నాం. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్​ చేస్తున్న పోరాటంలో అమెరికాతో పాటు మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు అందించిన ఆయుధాల సరఫరా కీలక పాత్ర పోషిస్తున్నాయి" అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ అభ్యర్థన మేరకు బైడెన్ ఈ కొత్త సహాయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 24న రష్యా దాడి మొదలుపెట్టిన నాటి నుంచి అమెరికా అనేక విధాలుగా ఉక్రెయిన్​కు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ చేస్తున్న తిరుగుబాటులో అమెరికా అందించిన ఆయుధాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

Ukraine President: ఉక్రెయిన్​కు 800 మిలియన్ల డాలర్ల భారీ ప్యాకేజీని అందించడంపై ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్​​ జెలెన్​స్కీ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఉక్రెయిన్​లో పర్యటించి.. తమ మద్దతు తెలిపిన పొలాండ్​, ఎస్టోనియా, లిథోనియా, లట్​​వియా అధ్యక్షులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ఆయుధాల రవాణా, రష్యాపై మరింత కఠిన ఆంక్షలు వంటి అంశాలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్​తో చర్చించినట్లు జెలెన్​స్కీ తెలిపారు. ఉత్తర ఉక్రెయిన్‌లో రష్యన్‌ బలగాలు విడిచిపెట్టిన పదివేల పేలని షెల్‌లు, గనులు, ట్రిప్ వైర్‌లను తొలగించే పని కొనసాగుతోందని జెలెన్​స్కీ వివరించారు. ఆయా పట్టణాల్లోని తమ ఇళ్లకు తిరిగి వచ్చేవారు.. తమ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు.

ఇదీ చదవండి: Ukraine Russia Conflict: రష్యాకు బాల్టిక్​ దేశాలు షాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.