ETV Bharat / international

నిరసనకారులపై కాల్పులు, 20 మంది మృతి, మరో వంద మంది - షియా మతగురువు ముక్తాదా అల్​ సదర్ రాజీనామా

Baghdad clashes ఇరాక్​లో కాల్పులు కలకలం రేపాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. మరో 100 మంది గాయపడ్డారు. ప్రముఖ షియా మత గురువు ముక్తాదా అల్ సదర్ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం వల్ల దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 30, 2022, 10:01 AM IST

Baghdad clashes: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్​-సదర్ ప్రకటించడం వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్యాలెస్​పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు.

shooting in iraq
నిరసనకారులు
shooting in iraq
ప్రభుత్వ ప్యాలెస్ గోడను ధ్వంసం చేసిన నిరసనకారులు

తాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం. గతేడాది అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అల్​-సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. షియా వ్యతిరేక వర్గాలతో మంతనాలు జరిపేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. చర్చల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో రాజకీయం వేడెక్కింది.

shooting in iraq
ప్రభుత్వ ప్యాలెస్​ బయట నిరసనకారులు

ఇవీ చదవండి: సగానికిపైగా పాకిస్థాన్‌ వరదలోనే, 1100 దాటిన మృతులు, మోదీ ఏమన్నారంటే

సగానికిపైగా పాకిస్థాన్‌ వరదలోనే, 1100 దాటిన మృతులు, మోదీ ఏమన్నారంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.