ETV Bharat / international

ASEAN Summit 2023 Modi : ' ఈ శతాబ్దం మనది.. పరస్పర సహకారంతో ప్రగతి పథం' - ఆసియాన్ సమావేశం జకార్తా 2023

ASEAN Summit 2023 Modi : ఇండోనేషియాలో గురువారం జరిగిన ఆసియాన్​-ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన మోదీ.. దక్షిణాది దేశాల వాణిని బలోపేతం చేయాలన్నారు. ఆసియాన్​ దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు.

ASEAN Summit 2023 Modi
ఆసియాన్ సమ్మిట్ 2023 మోదీ
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 10:39 AM IST

Updated : Sep 7, 2023, 12:56 PM IST

ASEAN Summit 2023 Modi : ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ తరువాత జరిగిన మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందేందుకు ఆసియాన్​ దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దాంతోపాటు దక్షిణాది దేశాల వాణిని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో గురువారం జరిగిన 20వ ఆసియాన్‌-ఇండియా సదస్సులో పాల్గొన్న మోదీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండో పసిఫిక్​ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మానవాభివృద్ధికి ఆసియాన్​ దేశాలు కృషి చేయాలని సూచించారు.

ASEAN Meeting Jakarta 2023 : ఇండో-పసిఫిక్​ దేశాల దృక్పథాన్ని భారత్ గౌరవిస్తుందని.. సమావేశంలో పాల్గొన్న సభ్యదేశాల ప్రతినిధులకు మోదీ స్పష్టం చేశారు. ఆసియాన్‌ దేశాలు వృద్ధికి కేంద్రంగా ఉంటాయని.. అవి ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన వివరించారు. '21 శతాబ్దాన్ని.. ఆసియా శతాబ్దంగా ఆయన అభివర్ణించిన మోదీ.. 'ఇది మనందరి శతాబ్దమంటూ' వ్యాఖ్యానించారు.

  • #WATCH | At the ASEAN-India Summit in Jakarta, Indonesia, Prime Minister Narendra Modi says "Our partnership has reached the fourth decade. It is an honour for me to co-chair this Summit. I want to congratulate Indonesian President Joko Widodo for organising this Summit..." pic.twitter.com/MQfVQayV3G

    — ANI (@ANI) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. ఆసియాన్​ దేశాల పరస్పర సహకారంతో స్థిరమైన పురోగతి జరుగుతోందన్నారు నరేంద్ర మోదీ. భారత ఈస్ట్ యాక్ట్ విధానానికి మూల స్తంభంగా 'ఆసియాన్' ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ఆసియాన్‌-ఇండియా భాగస్వామ్యం నాలుగో దశాబ్దంలోకి అడుగుపెట్టిందని సదస్సులో మోదీ పేర్కొన్నారు.
ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్​).. ఈ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన సమూహాలలో ఒకటిగా పరిగణించవచ్చు. ఆసియాన్‌లో భారత్​తోపాటు అమెరికా, చైనా, జపాన్‌, ఆస్ట్రేలియాలు చర్చల భాగస్వాములుగా ఉన్నాయి.

ప్రవాస భారతీయుల నుంచి మోదీకి ఘన స్వాగతం..
Modi Indonesia Tour 2023 : ఇండోనేషియాలో జరిగిన 20వ ఆసియాన్‌-ఇండియా, 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మోదీకి.. అక్కడి ప్రవాస భారతీయల నుంచి ఘన స్వాగతం లభించింది. శ్రీ కృష్ణ జన్మష్టమి ఉత్సవాల నేపథ్యంలో గోపికల వేషధారణలో మోదీ ఆహ్వానం అందించారు మహిళలు. ప్రవాసులతో కాసేపు ముచ్చటించిన మోదీ.. అనంతరం సదస్సు జరిగే వేదిక వద్దకు వెళ్లిపోయారు.

భారత్​కు​ పయనమైన మోదీ..ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా సదస్సు ముగించికుని గురువారం మధ్యాహ్నం భారత్ బయలుదేరారు ప్రధాని.

Brazil Floods 2023 : భారీ వరదలు.. 31 మంది మృతి.. జలదిగ్బంధంలో 60 నగరాలు..

Research on Cancer 2023 : 50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్‌ ముప్పు.. పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

Last Updated : Sep 7, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.