ETV Bharat / international

'పెరట్లో పామును పెంచి.. పక్కవారినే కాటేయ్యాలంటే ఎలా'..? ఐరాసలో పాక్‌పై జైశంకర్‌ నిప్పులు

అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాకిస్థాన్‌ మరోసారి ప్రయత్నించింది. అయితే పాక్​కు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దీటైన సమాధానం ఇచ్చారు. దీంతో మరోసారి పాకిస్థాన్​కు భంగపాటు తప్పలేదు.

Another setback for Pakistan who tried to make India guilty on the international stage
భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌
author img

By

Published : Dec 16, 2022, 10:44 AM IST

Updated : Dec 16, 2022, 10:55 AM IST

అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్థాన్‌ ఆగడాలను భారత్‌ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మర్చిపోలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఇకనైనా ఆ దేశం తమ చేష్టలను మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ ఓసారి పాకిస్థాన్‌పై చేసిన ‘పాము’ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. దాయాదిపై నిప్పులు చెరిగారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రపంచం అవలంభించాల్సిన విధానాలపై ఐరాస భద్రతా మండలిలో భారత్‌ అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం జైశంకర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పాకిస్థాన్‌ మంత్రి ఒకరు భారత్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పై మీడియా జైశంకర్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘ఆ మంత్రి అన్న వ్యాఖ్యలు నేను కూడా విన్నాను. ఇక్కడో విషయం వారికి గుర్తుచేయాలి. ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ.. ‘పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు.. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి’ అని చెప్పారు. కానీ పాకిస్థాన్‌కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదు. ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు’’ అని దాయాదిని ఘాటుగా విమర్శించారు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆ దేశాన్ని(పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ) ఉగ్రవాద కేంద్రంగా చూస్తోందని జైశంకర్‌ అన్నారు. ‘‘గత రెండున్నరేళ్లుగా మన ఆలోచనలన్నీ కరోనా మహమ్మారి చుట్టూనే ఉన్నాయి. కానీ, ప్రపంచం ఏం తెలివితక్కువది కాదు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలైందన్న విషయాన్ని అన్ని దేశాల ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. అందుకే ఇతరులపై నిందలు వేయాలని కలలు కనే ముందు తామేంటో గుర్తుచేసుకోవాలి’’ అని ఎద్దేవా చేశారు.

ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ నివాసం ముందు గతేడాది బాంబు పేలుడు జరిగింది. అయితే, ఈ దాడి వెనుక భారత్‌ కుట్ర ఉందని ఆరోపిస్తూ పాకిస్థాన్ ఇటీవల ఓ పత్రాన్ని విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని భారత్‌ కంటే మెరుగ్గా ఎవరూ ఉపయోగించుకోలేరంటూ ఆ దేశ మంత్రి నోరుపారేసుకున్నారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన జైశంకర్‌.. పాక్‌కు గట్టిగా బుద్ధిచెప్పారు.

Last Updated : Dec 16, 2022, 10:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.