ETV Bharat / international

భారత్​లో రష్యా విదేశాంగ మంత్రి.. అమెరికా తీవ్ర హెచ్చరిక - రష్యా విదేశాంగ మంత్రి

America comments on india: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ గురువారం.. దిల్లీలో అడుగుపెట్టిన వేళ భారత్​కు అమెరికా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధాన్ని ఖండించకపోవడాన్ని, రష్యా అధ్యక్షుడు పుతిన్​ను విమర్శించకపోవడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. 'భవిష్యత్తులో చైనాకు జూనియర్‌ భాగస్వామిగా రష్యా తయారవుతుంది.. అప్పుడు వాస్తవాధీన రేఖను డ్రాగన్‌ ఉల్లంఘిస్తే భారత్‌ను ఎవరు అదుకుంటారన్న' ప్రశ్ననూ అమెరికా పరోక్షంగా సంధించింది.

america
అమెరికా
author img

By

Published : Apr 1, 2022, 6:42 AM IST

America comments on india: రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లవ్రోవ్‌ గురువారం దిల్లీలో అడుగుపెట్టిన వేళ.. అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం గత కొన్ని రోజులుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. యుద్ధాన్ని ఖండించకపోవడాన్ని, పుతిన్‌ను విమర్శించకపోవడాన్ని బైడెన్‌ యంత్రాంగంలోని సీనియర్‌ అధికారులు తప్పుపడుతున్నారు. ఈ సందేశాన్నే మోసుకు వచ్చిన అగ్రరాజ్యం ఉప జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్‌ సింగ్‌ బుధ, గురువారాల్లో భారత అధికారులతో విస్త్రృతంగా చర్చలు జరిపారు. ఈ సంభాషణల్లో భారత్‌ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. కొందరు విలేకరులతో దలీప్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ పోషించిన పాత్రను తప్పుపట్టారు. ఓవైపు యుద్ధం జోరుగా సాగుతున్న వేళ.. రష్యా నుంచి భారత్‌ చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ దిగుమతులు తాము రష్యాపై విధించిన ఆంక్షల పరిధిలోకి రావంటూనే.. మాస్కో చమురుపై భారత్‌ చూపిస్తున్న ఉత్సాహాన్ని తగ్గించుకోవాలన్న సంకేతాలను ఇచ్చారు. లవ్రోవ్‌ పర్యటనలో ప్రధానంగా చౌక చమురు దిగుమతులపైనే చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో దలీప్‌ సింగ్‌.. భారత్‌ లావాదేవీల కారణంగా రష్యా కరెన్సీ రూబుల్‌ బలపడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము సహించబోమని పేర్కొన్నారు. మాస్కో నుంచి వస్తున్న చమురుకు భారత్‌ రూబుల్స్‌లోనే చెల్లిస్తోంది. రూబుల్‌-రూపాయి చెల్లింపు విధానం కూడా లవ్రోవ్‌తో చర్చల్లో ప్రధాన అంశం కానుంది. ఈ కోణంలోనే దలీప్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేశారు. తమ ఆంక్షలను నిర్వీర్యం చేసేలా ఏ దేశం వ్యవహరించినా, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తమ దేశాల మధ్య హద్దుల్లేని సహకారముందంటూ ఇటీవల రష్యా-చైనా పదేపదే చెబుతున్న అంశాన్నీ దలీప్‌ సింగ్‌ ప్రస్తావించారు. ఈ సహకారం భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని అన్నారు. భవిష్యత్తులో చైనాకు జూనియర్‌ భాగస్వామిగా రష్యా తయారవుతుందని, అప్పుడు వాస్తవాధీన రేఖను డ్రాగన్‌ ఉల్లంఘిస్తే భారత్‌ను ఎవరు అదుకుంటారన్న ప్రశ్ననూ పరోక్షంగా సంధించారు. రష్యా సాయంగా వస్తుందా.. అంటూ ప్రశ్నించారు. రష్యాపై చైనా పట్టు సాధిస్తే.. అది భారత్‌కు మరింత నష్టమని పేర్కొన్నారు. దలీప్‌ సింగ్‌ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించలేదు.

దిల్లీకి చేరుకున్న లవ్రోవ్‌.. మోదీతో భేటీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ గురువారం.. చైనా పర్యటన నుంచి నేరుగా భారత్‌ చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ కానున్నారని రష్యా ప్రతినిధి తెలిపారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు మాత్రం తమ ప్రకటనలో ఎక్కడా ప్రధానితో సమావేశం ఉంటుందని పేర్కొనలేదు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో.. లవ్రోవ్‌ చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధ తాజా పరిస్థితిని వివరించనున్నారు. చర్చల్లో ద్వైపాక్షిక అంశాలు, ఇరు దేశాల సంబంధాల బలోపేతం సహా ఇతర కీలక అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.

ఇదీ చదవండి: 'రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. చివరి వరకు పోరాడతా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.