ETV Bharat / international

అప్పుడే ఐరోపా గజగజ.. చలితో కాదు.. గ్యాస్​ సమస్యతో..

గడ్డకట్టుకుపోయే చలికి గజగజలాడటం సహజం. కానీ చలికాలం ఇంకా రాకముందే ఐరోపా గజగజలాడుతోంది! చలితో కాదు.. గ్యాస్‌ సమస్యతో!

europe gas crisis
europe gas crisis
author img

By

Published : Oct 22, 2022, 7:42 AM IST

Europe Gas Crisis: రాబోయే శీతాకాలంలో తలెత్తనున్న గ్యాస్‌ సంక్షోభాన్ని తట్టుకోవటమెలాగా అని ఐరోపా దేశాలన్నీ తలపట్టుకుంటున్నాయి. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులను చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఇంధన పేదరికం రాబోతోందంటూ ఆందోళన చెందుతున్నారు.

రష్యాపైనే ఆధారం..
ఇప్పటికే ఐరోపా అంతటా ఇంధన సమస్య మొదలైంది. ఇంతకుముందెన్నడూ లేనంతగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. చలికాలం ఆరంభం కాబోతుండటంతో ఇంధన అవసరాలు మరింత పెరగబోతున్నాయి. మరోవైపు సప్లయ్‌ మాత్రం డిమాండ్‌కు తగినంతగా లేదు. వీటన్నింటికీ మూలకారణం రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.

  • ఐరోపాలోని పరిశ్రమలు, విద్యుత్‌ ఉత్పత్తి, ఇళ్లలో వెచ్చదనం.. అన్నింటికీ ఎక్కువ మేరకు గ్యాసే ఆధారం.
  • ఈ గ్యాస్‌ కోసం యురోపియన్‌ యూనియన్‌లోని సభ్యదేశాలు రష్యాపై అధికంగా ఆధారపడి ఉన్నాయి. వాటి గ్యాస్‌ వాడకంలో 40శాతం రష్యా నుంచి పైప్‌లైన్‌ ద్వారా వచ్చేదే.
  • యుద్ధం కారణంగా అమెరికాతో కలసి ఐరోపా దేశాలన్నీ రష్యాపై కన్నెర్రజేసి ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల బూచి చూపి... పైప్‌లైన్‌ నిర్వహణలో ఇబ్బందులంటూ రష్యా గ్యాస్‌ సరఫరాపై వేటు వేసింది. ఫలితంగా ఐరోపాకు గ్యాస్‌ దిగుమతుల్లో 75 శాతం కోతపడింది.
  • దీంతో ఐరోపా దేశాలు ఇతర దేశాల నుంచి ఎల్‌ఎన్‌జీని కొనాల్సి వస్తోంది. ఇందుకోసం అధిక మొత్తం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇది అంతిమంగా ప్రజలపై భారం పడుతోంది.
  • పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో రాబోయే చలికాలంలో ఐరోపా ప్రజలు భారీగా దెబ్బతినే అవకాశముందని అంతర్జాతీయ ఇంధన ఏజన్సీ (ఐఈఏ) ఆందోళన వ్యక్తంజేసింది.

సొంత వనరులున్నా ..

  • ప్రపంచంలో అందరికంటే అధిక సహజవాయువు దిగుమతిదారు ఐరోపానే.
  • ఐరోపా దేశాలకు సొంతగా గ్యాస్‌, చమురును తయారు చేసుకునే అవకాశం ఉంది. కానీ తమ సహజ వనరులను తవ్వకూడదని నిర్ణయం తీసుకొని చాలా సంవత్సరాలుగా రష్యా నుంచి సరఫరాలపై ఆధారపడి బతుకుతున్నాయి.
  • దేశీయంగా తమ ఉత్పత్తిని పూర్తిగా కుదించిన యూరోపియన్‌ యూనియన్‌... తమ 80శాతం గ్యాస్‌ అవసరాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాలన్నీ తమ దేశాల్లోని సహజ వాయువులను తవ్వితీయటానికి ఇష్టపడటం లేదు.
  • రవాణా, ఇళ్లు, పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం, ఆహారోత్పత్తి... ఇలా ఐరోపాలో ప్రతిరంగం ఇంధనంతో ముడిపడి ఉంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు, బేకరీ ఆధారిత ఆహారోత్పత్తులపై ఈ ఇంధన సంక్షోభం దెబ్బ బలంగా పడింది.
  • గత ఏడాదిలో ఐరోపా అంతటా వెన్న (బటర్‌) ధరలు 80 శాతంపైగా పెరిగాయి. చీజ్‌ 45% దాకా, మాంసం 30%, పాలపొడి ధర 50 శాతంపైగా పెరిగింది. ఎరువుల ధరలు 60 శాతం పెరగటంతో రైతులు చాలా చోట్ల పంటలు ఆపేశారు.
  • గ్యాస్‌, విద్యుత్‌ ధరలు అనూహ్యంగా ఆకాశానికి ఎగియటంతో ప్రజలు ఎక్కువ మేరకు వీటిపైనే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
  • ఈ ఏడాది ఐరోపా అంతటా ఇంధన పేదరికం పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంధన పేదరికమంటే... చలికాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచుకోలేకపోవటం. ఐరోపాలోని చాలాప్రాంతాల్లో చలికాలం తీవ్రంగా ఉంటుంది. ఇళ్లను వెచ్చగా ఉంచుకోకుంటే బతకలేని పరిస్థితి. సరైన ఉష్ణోగ్రత లేకుంటే... ఆరోగ్య సమస్యలు తలెత్తటంగానీ, పాతవి తిరగబెట్టడంగానీ జరగొచ్చు.

దాచిపెట్టేస్తున్నారు..

  • అనేక దేశాలు ఇప్పటికే గ్యాస్‌ను ముందే కొని రిజర్వ్‌ చేసుకునే ప్రక్రియ మొదలెట్టాయి. నవంబరుకల్లా 80శాతం నార్వే, అజర్‌బైజాన్‌ తదితర దేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి.
  • పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం ప్రజలపై పడకుండా తాత్కాలికంగా రాయితీలివ్వాలని జర్మనీ, బ్రిటన్‌లాంటివి ఆలోచిస్తున్నాయి.
  • ఇప్పటికే ఐరోపాలోని చాలా ఇళ్లలో ఇందన ఆదాపై చర్చలు మొదలయ్యాయి. రాబోయే చలికాలం విడివిడిగా ఎవరి గదుల్లో వారు కాకుండా ఒకే గదిలో కుటుంబమంతా పడుకుందామా అనే సంభాషణలు మొదలయ్యాయి.
  • విద్యుత్‌ వినియోగాన్ని 10% స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని, పీక్‌ వినియోగ సమయాల్లో 5% తగ్గించుకోవాలని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు లాంఛనంగా నిర్ణయానికి వచ్చాయి. 'ఈ డిసెంబరు 1 నుంచి 2023 మార్చి 31 దాకా.. ఆయా దేశాలు తమతమ పీక్‌ వినియోగ సమయాలను గుర్తించి 10% వినియోగాన్ని తగ్గించే ప్రణాళికలు అమలు చేస్తాయి' అని యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.
  • చలికాలం ఇంధన కోతల్లేకుండా చూస్తానంటూ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికవటానికి ముందు ట్రస్‌ హామీ ఇచ్చారు. రాజకీయ సంక్షోభంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితి మారిపోయింది.
  • చలికాలం ఓ మోస్తరుగా సాగిపోతే రిజర్వ్‌ గ్యాస్‌తో గట్టెక్కవచ్చనే అనుకుంటున్నారు. ఒకవేళ చలి తీవ్రత హెచ్చితే మాత్రం గ్యాస్‌ డిమాండ్‌ పెరుగుతుంది. అప్పుడు సమస్య తీవ్రమౌతుంది. అదే జరిగితే ఇళ్లను వెచ్చగా ఉంచటానికి ప్రాధాన్యమిచ్చి పరిశ్రమలకు కోతపెడతారు. అది నిరుద్యోగానికి దారితీస్తుంది. 'ఏమౌతుందన్నది ఈసారి చలితీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈసారికి గట్టెక్కినా ఐరోపాను గ్యాస్‌ కొరత వెంటాడబోతోంది. ఇది మునుముందు సమస్యలకు దారితీస్తుంది' అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • ఇవీ చదవండి:
  • పాకిస్థాన్​కు భారీ ఊరట.. 'గ్రే లిస్ట్' నుంచి నాలుగేళ్ల తర్వాత తొలగింపు..
  • వారంలోనే బ్రిటన్​కు కొత్త ప్రధాని.. తప్పుకోవాలని రిషికి బోరిస్ విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.