ETV Bharat / international

Afghanistan Crisis 2023 : ఆస్తులు అమ్మేస్తున్న అఫ్గాన్లు.. ఆకలితోనే లక్షలాది మంది.. ఒక్క పూట కూడా.. - అఫ్గానిస్థాన్ ఎకనమీ 2023

Afghanistan Crisis 2023 : అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్ పౌరుల బతుకులు ఛిద్రం అవుతున్నాయి. ​ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి, సరైన వేతనాలు లేక దేశంలో దారిద్య్రం తాండవం చేస్తోంది. రెండు పూటల తిండిలేక ఆకలితో లక్షలాది మంది అలమటిస్తున్నారు.

Afghanistan Crisis 2023
అఫ్గానిస్థాన్ ఆర్థిక సంక్షోభం
author img

By

Published : Aug 11, 2023, 10:09 PM IST

Afghanistan Crisis 2023 : తాలిబన్ల ఆటవిక పాలనలో అఫ్గానిస్థాన్ ప్రజల బతుకులు ఛిన్నాభిన్నం అయ్యాయి. దేశమంతటా దారిద్య్రం తాండవిస్తోంది. తినడానికి తిండిలేక లక్షలాది పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. సరైన వేతనాలు లేకపోవడం వల్ల కుటుంబ పోషణ సైతం భారంగా మారింది. అక్కడి ప్రజలకు ఆహారం కోసం ఇంట్లో వస్తువులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. అమెరికా, నాటో బలగాలు దేశం నుంచి వెళ్లిన తర్వాత.. అఫ్గాన్‌ పౌరుల జీవితాలు దినదిన గండాలుగా మారాయి.

అఫ్గానిస్థాన్‌లో 2021లో అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టారు. అప్పటి నుంచి అక్కడి పౌరులు నిత్యం నరకం చూస్తున్నారు. తాలిబన్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. రోజుకు 2 పూటలు కడుపు నిండా తిండి తినలేని పరిస్థితుల్లో బతుకుతున్నారు. సంప్రదాయ పాలన పేరుతో తాలిబన్లు సాగిస్తున్న అరాచక పాలనతో దేశంలో ఉద్యోగాలు కనుమరుగయ్యాయి.

వస్త్ర తయారీపై ఆంక్షలు, బ్యూటీపార్లర్లపై నిషేధం వంటి వాటితో ఉద్యోగ కల్పన మరింత కష్టంగా మారింది. నిత్యావసరాల కోసం అఫ్గాన్‌లు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తాలిబన్‌లు కోతలు విధిస్తున్నారు. పౌరులు వారి సొంత డబ్బును.. వారానికి ఒకేసారి అది కూడా పరిమితంగానే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోవాలన్న ఆంక్షలు అక్కడ అమల్లో ఉన్నాయి.

అఫ్గానిస్థాన్‌ది ఇతర దేశాలు, స్వచ్చంద సంస్థలు ఆర్థిక సాయం చేస్తే తప్ప.. జీవించలేని ఎయిడ్‌ ఎకానమీ కావడం వల్ల.. అమెరికా సైన్యం నిష్క్రమణ తర్వాత ఆ దేశం పూర్తిగా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లింది. తాలిబన్ల అరాచక పాలనలో భద్రత లేమి, బాలికలకు విద్యను, మహిళలకు ఉద్యోగాలు దూరం చేయడం, అనేక ఆంక్షలు విధించడం వల్ల అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు అక్కడ కార్యకలాపాలను తగ్గించాయి.

తాలిబన్ల అరాచకాల కారణంగా ఇతర దేశాలు అఫ్గాన్‌కు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. చాలా దేశాలు తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తించడం లేదు. ఆర్థిక చేయూత ఇవ్వడం మానేశాయి. విదేశాల్లోని అఫ్గానిస్థాన్‌ ఆస్తులను ఆయా దేశాలు స్తంభింపజేశాయి. చివరికి విదేశాల్లో పని చేసే అఫ్గాన్లు స్వదేశంలో తమ కుటుంబాలకు పంపే డబ్బుతోనే చాలా మంది అఫ్గాన్‌ వాసులు జీవనం సాగిస్తున్నారు.

ఓ వైపు చలి.. మరోవైపు ఆకలి కేకలు.. అఫ్గాన్​లో దుర్భర పరిస్థితులు

Afghan Crisis: 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలకు ముప్పు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.