ETV Bharat / international

అప్గాన్​ మసీదు, స్కూల్​లో బాంబు పేలుళ్లు- 33 మంది మృతి - afghanistan bomb blast

Afghanistan bomb blast: అఫ్గానిస్థాన్​లో జరిగిన బాంబు పేలుళ్లలో 33 మంది మరణించగా, మరో 43 మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.

Afghanistan bomb blast
అఫ్గానిస్థాన్
author img

By

Published : Apr 22, 2022, 9:58 PM IST

Updated : Apr 22, 2022, 10:39 PM IST

Afghanistan bomb blast: అఫ్గానిస్థాన్​లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. మసీదు, మతపరమైన పాఠశాలలో జరిగిన బాంబు దాడిలో 33 మంది మరణించారని తాలిబన్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో మరో 43 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు.

కుందుజ్ ప్రావిన్స్‌లోని ఇమామ్ సాహెబ్ పట్టణంలో ఈ ఘటన జరిగిందని జబీహుల్లా ముజాహిద్ ట్వీట్​ చేశారు. ఈ బాంబు దాడికి పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉంది. ఐసిస్​ పాత్రే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గురువారం.. ఉత్తర మజర్-ఇ-షరీఫ్​​లోని మసీదుపై దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ బాంబు పేలుడులో 10 మంది మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు.

ఇదీ చదవండి: శత్రు దేశాల అధినేతల 'ప్రేమ లేఖలు'- అసలు లక్ష్యం అదేనా?

Last Updated : Apr 22, 2022, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.