ETV Bharat / international

రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు నటులు - 9 మంది మృతి

మెక్సికోలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు సినీ నటులు కూడా ఉన్నారు. నెట్​ఫ్లిక్స్​ నిర్మాణంలో తెరకెక్కుతున్న ది చోసెన్​ వన్​లో వీరు నటిస్తున్నారు.

్
author img

By

Published : Jun 18, 2022, 7:33 AM IST

తీర్థయాత్రలకు వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని చియాపాస్​ రాష్ట్రం టిలా అనే ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ప్రయాణికులు కార్పస్​ క్రిస్టీ ఈవెంట్​కు హాజరై ఇంటికి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన దర్యాప్తు చేపడుతున్నామని.. బస్సు అదుపు తప్పడమే ఈ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతిచెందిన వారు టబాస్కో ప్రాంతానికి చెందినవారని తెలిపారు. మరోవైపు గాయపడిన 40 మందిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

నటులు దుర్మరణం: మెక్సికోలోనే మరో విషాదం వెలుగుచూసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'ది చోసెన్​ వన్​' వెబ్​సిరీస్​కు చెందిన ఇద్దరు నటులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ములిగే నగరం సమీపాన జరిగిన ఈ ప్రమాదం వ్యాన్​ అదుపుతప్పడం వల్లే జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు.. రేమండో గార్డునో క్రూజ్​, జూవాన్​ ఫ్రాన్సిస్కో గొన్జాలేజ్​ అగ్విలర్​గా గుర్తించారు.

ఇదీ చూడండి : పాకిస్థాన్​లో ఇద్దరు హిందూ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.