ETV Bharat / international

చైనా స్పేస్​ స్టేషన్ పనులు వేగవంతం.. అంతరిక్షంలో ముగ్గురు వ్యోమగాములు - china news today

China space station: చైనా స్పేస్ స్టేషన్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆదివారం షెన్‌ఝూ-14 అంతరిక్ష నౌకను చైనా ప్రయోగించింది. ఇది ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వారు 6 నెలలపాటు అక్కడే ఉండి అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో పాల్గొననున్నారు.

chinas-space-station
చైనా స్పేషన్ స్టేషన్ పనులు వేగవంతం
author img

By

Published : Jun 6, 2022, 5:10 AM IST

China Space Misson: అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న తియాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణం వేగంగా సాగుతోంది. ఆదివారం షెన్‌ఝూ-14 అంతరిక్ష నౌకను చైనా ప్రయోగించింది. ఇది ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వారు 6 నెలలపాటు అక్కడే ఉండి అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో పాల్గొననున్నారు. షెన్‌ఝూ-14 అంతరిక్ష నౌకను లాంగ్‌మార్చ్‌ 2 FY14 రాకెట్‌పై ఉంచి ఈశాన్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌ నుంచి ప్రయోగించారు.

ఈ మిషన్‌లో కమాండర్‌ చెన్‌డాంగ్‌, ల్యూ యాంగ్‌, చైషూఝె ఉన్నారు. వారిలో చెన్‌ 2016లో నిర్వహించిన షెన్‌ఝూ 11 మిషిన్‌లో పాల్గొన్నారు. చెంగ్డూలో నిర్వహించిన శిక్షణాశిబిరంలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినవారిని ఈ మిషిన్‌కు ఎంపిక చేసినట్లు చైనా తెలిపింది. షెన్‌ఝూ-14లో చిన్న రోబోటిక్‌ చేతులను కూడా అమర్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 16న షెన్‌ఝూ-13 మిషిన్‌ సురక్షితంగా భూమికి చేరుకొంది. ఈ మిషిన్‌లో చైనా స్పేస్‌ స్టేషన్‌ టెక్నాలజీ వెరిఫికేషన్‌ను పూర్తి చేశారు.

ఇదీ చదవండి: కీవ్​పై విరుచుకుపడ్డ రష్యా.. పశ్చిమ దేశాల ఆయుధాలే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.