ETV Bharat / international

ప్రాణాల మీదకు తెచ్చిన హస్తప్రయోగం.. లంగ్స్​కు 'చిల్లు'.. చరిత్రలో తొలిసారి! - హస్తప్రయోగం న్యూస్​

Masturbating News: ఓ 20 ఏళ్ల యువకుడికి హస్తప్రయోగం చేసే సమయంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా ఊపిరితిత్తుల్లో ఇబ్బంది తలెల్తి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే ఆస్పత్రిలో చేరగా వైద్యులు అతడ్ని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. వైద్య చరిత్రలోనే ఇలాంటి అరుదైన కేసు తొలిసారి చూస్తున్నట్లు చెప్పారు.

20 years old  suffered-rare-lung-injury-during- masturbate
హస్తప్రయోగ సమయంలో యువకుడికి షాక్​.. ఒక్కసారిగా ఊపిరి ఆగి ఆస్పత్రికి..
author img

By

Published : Apr 14, 2022, 4:09 PM IST

Masturbating lung injury: స్విట్జర్లాండ్​లో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. వింటర్​థర్​ నగరంలో 20 ఏళ్ల యువకుడు హస్తప్రయోగం చేసుకునే సమయంలో కుప్పకూలాడు. ఊపరితిత్తుత్లో ఇబ్బందులు తలెత్తి శ్వాస తీసుకోలేకపోయాడు. ఛాతిలో భరించలేని నొప్పి రావడం వల్ల హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నాడు. వెంటనే వైద్యులు అతడ్ని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయితే సాధారణంగా కఠోర వ్యాయామం చేసే సమయంలోనో, శృంగారంలో పాల్గొనే సమయంలోనే ఇలాంటి అరుదైన కేసులు వెలుగుచూస్తుంటాయని వైద్యులు చెప్పారు. కానీ హస్తప్రయోగం చేసే సమయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఈ యువకుడి కేసుకు సంబంధించిన వివరాలను 'రేడియాలజీ కేస్​ రిపోర్ట్స్'​ పేరుతో ఓ జర్నల్​లో ప్రచురించారు. దాని ప్రకారం..

Masturbating Problems: యువకుడు ఆస్పత్రికి వచ్చినప్పుడు అతని మొహం ఉబ్బింది. మెడ భాగం నుంచి చేతుల వరకు ఎక్కడ పట్టుకున్నా.. టక్​ టక్​ అని కీళ్లు విరిచినప్పుడు వచ్చే శబ్దం వచ్చింది. దీంతో వైద్యులు యువకునికి స్పాంటేనియస్​ న్యూమోమీడియాస్టినమ్​(SPM) పరీక్ష చేశారు. అందులో యువకుడి ఊపరితిత్తుల నుంచి గాలి లీక్​ అయి.. శరీరం అంతా వ్యాపించినట్లు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగి ఉంటుందో తెలియనప్పటికీ యువకుల్లో ఇలాంటి సమస్యలు సాధారణమే అని వైద్యులు చెప్పారు. సెక్స్ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైన సందర్భాలు ఉన్నాయి కానీ, హస్తప్రయోగ సమయంలో ఇలా జరిగిన దాఖలాలు లేవు అని వివరించారు.

Masturbating Health Issues: యువకుడి వైద్య చరిత్రను పరిశీలిస్తే అతనికి తేలికపాటి అస్థమాతో పాటు 'అటెన్షన్​ డెఫిసిట్​ హైపర్​యాక్టివిటీ డిజార్డర్​' ఉందని కాంటోనల్​ ఆస్పత్రి వైద్య నిపుణులు వెల్లడించారు. అస్థమాకు అతడు చికిత్స కూడా తీసుకోలేదని చెప్పారు. డ్రగ్స్​, స్మోకింగ్​ వంటి అలవాట్లు తనకు లేవని, దగ్గు కూడా లేదని యువకుడు చెప్పినట్లు వివరించారు. కఠోర వ్యాయామాలు కూడా చేయలేదన్నారు.

యువకుడు ఆస్పత్రిలో చేరిన తొలిరోజు ఐసీయూలో ఉంచి ఆక్సిజన్​ సపోర్ట్ ఇచ్చారు వైద్యులు. పారాసెటమాల్​తో పాటు యాంటీబయాటిక్​ మెడిసిన్ ఇచ్చి చికిత్స అందించారు. ఆ మరునాడు పరిస్థితి మెరుగుపడటం వల్ల జనరల్ వార్డుకు మార్చారు. కానీ యువకుడికి ఛాతినొప్పి మాత్రం మూడు రోజులపాటు ఉంది. నాలుగో రోజు అతన్ని డిశ్ఛార్జ్​ చేశారు. అప్పటికి అతనికి ఎలాంటి తీవ్ర ఇబ్బందులు లేవని వైద్యులు చెప్పారు. ఇలాంటి అరుదైన కేసు చూడటం ఇదే తొలిసారి అన్నారు.

ఇదీ చదవండి: పోలీసు కర్కశం.. నల్లజాతీయుడిని కింద పడేసి.. తలపై కాల్చి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.