ETV Bharat / international

లోయలోకి దూసుకెళ్లిన వ్యాను.. 10 మంది దుర్మరణం - Khyber Pakhtunkhwa

Van Falls Into Ditch in Pakistan: ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాను లోయలో పడింది. పాకిస్థాన్​లో జరిగిన ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

van falls into ditch in Pakistan
van falls into ditch in Pakistan
author img

By

Published : Mar 28, 2022, 10:18 PM IST

Van Falls Into Ditch in Pakistan: పాకిస్థాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాను లోయలోకి దూసుకెళ్లగా.. మహిళలు, చిన్నారులు సహా మొత్తం 10 మంది మరణించారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. ఖైబర్​ పఖ్తుంఖ్వాలోని పర్వత ప్రాంతాల్లో జరిగిందీ ఘటన. మార్దాన్​ జిల్లా నుంచి అప్పర్​ డిర్​ జిల్లాలోని కాల్​కోట్​వైపు వెళ్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పారు. వారందరినీ డిర్​ కోహిస్థాన్​లోని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఖైబర్​ పంఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మెహ్మూద్​ ఖాన్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: ఇమ్రాన్​పై 'అవిశ్వాస' అస్త్రం- ఇక కష్టమే!

వేడుకలో దుండగులు కాల్పులు.. 19 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.