ETV Bharat / international

ప్రపంచంపై మరోసారి కరోనా పంజా- వారంలోనే 11% పెరిగిన కేసులు - అమెరికాలో కరోనా కేసులు

Worldwide covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత వారంతో పోలిస్తే.. కొవిడ్​ కొత్త కేసుల సంఖ్య 11శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. అంటే.. దాదాపు 49లక్షల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారని చెప్పింది. మరోవైపు.. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయని పేర్కొంది.

worldwide covid cases
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు
author img

By

Published : Dec 29, 2021, 5:46 PM IST

Worldwide covid cases: ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత వారంతో పోలిస్తే... ఈ వారంలో కరోనా కేసులు 11శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తెలిపింది. అమెరికాలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయని చెప్పింది. అక్టోబరు నుంచి ఈ పెరుగుదల నమోదవుతూ ఉందని పేర్కొంది.

WHO on corona: మంగళవారం 'వీక్లీ ఎపిడెమిక్ రిపోర్ట్'​ను డబ్ల్యూహెచ్​ఓ విడుదల చేసింది. డిసెంబరు 20-26 మద్య ప్రపంచవ్యాప్తంగా 49లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పింది.

నివేదికలోని ముఖ్యాంశాలు...

  • మొత్తం కొత్త కేసుల్లో... సగం కంటే ఎక్కువ కేసులు ఐరోపాలోనే వెలుగు చూశాయి. ఐరోపాలో డిసెంబరు 20-26 మధ్య కొత్తగా 28 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.
  • అయితే... గత వారంతో పోలిస్తే ఇది 3శాతం మాత్రమే పెరుగుదల కావడం గమనార్హం.
  • ప్రపంచవ్యాప్తంగా ఐరోపాలోనే అత్యధిక ఇన్​ఫెక్షన్ రేటు ఉంది. అక్కడ లక్ష మందిలో 304.6 మంది చొప్పున కరోనా బారినపడుతున్నారు.
  • అమెరికావ్యాప్తంగా కొత్త కేసులు 38శాతం మేర పెరిగాయి. కొత్తగా 14.8 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
  • ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధిక ఇన్​ఫెక్షన్ రేటు అమెరికాలోనే ఉంది. లక్ష మందికి 144.4 మంది చొప్పున వైరస్ బారినపడుతున్నారు. ఒక్క అమెరికాలోనే 18 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
  • ఆఫ్రికాలో గత వారంతో పోలిస్తే.. కొత్త కేసులు సంఖ్య 7శాతం మేర పెరిగింది. అక్కడ 2,75,000 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
  • గత వారంతో పోలిస్తే కరోనా మరణాలు 4శాతం మేర తగ్గాయి. కొత్తగా మరో 44,680 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

'ఒమిక్రాన్​'తో రిస్క్​ ఎక్కువే..

Who omicron: ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​తో ముప్పు అధికంగానే ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. దక్షిణాఫ్రికా సహా బ్రిటన్, డెన్మార్క్​లోని సమాచారాన్ని పరిశీలిస్తే.. ఒమిక్రాన్​తో ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగా ఉన్నాయని చెప్పింది. అయితే... ఒమిక్రాన్ వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం కావాల్సి ఉందని పేర్కొంది.

కొత్త కేసులు ఇలా..

world coronavirus: ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 12,19,556 కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,570 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • అమెరికాలో కొత్తగా 3.12లక్షల కేసులు నమోదయ్యాయి. 1,811 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,42,161కు పెరిగింది.
  • బ్రిటన్​లో 1.29 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 18 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఫ్రాన్స్​లో 1.79 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 290 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,23,188కు చేరింది.
  • స్పెయిన్​లోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 99,671 కేసులు బయటపడ్డాయి. 114 మంది మృతి చెందారు.
  • ఇటలీలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 76 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 1,36,955కు చేరుకుంది.

ఇదీ చూడండి: అమెరికాలో కరోనా విలయం.. ఒక్కరోజే 4.41 లక్షల కేసులు

ఇదీ చూడండి: Omicron Cases: అక్కడ కొత్త కరోనా కేసుల్లో ఒమిక్రాన్​వే 60 శాతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.