ETV Bharat / international

ఎక్కువ సంఖ్యలో మానవులను హరించే జీవులు ఇవే.. - dangerous Insect

ఈ భూమి మీద అత్యధిక సంఖ్యలో మానవుల ప్రాణాలను హరించే జీవులు ఏంటో మీకు తెలుసా? మనం చాలా తేలికగా తీసుకునే కొన్ని కీటకాలు, పెంపుడు జంతువులకు ఏడాదికి ఏంత మంది బలవుతున్నారో తెలుసుకోవాలని ఉందా? చూడగానే భయపడే సింహం కంటే ప్రమాదకరమైన 'హ్యూమన్​ కిల్లర్స్'పై ప్రత్యేక కథనం మీకోసం..

human killers
ప్రమాదకర జీవులు
author img

By

Published : Apr 19, 2021, 3:06 PM IST

Updated : Apr 20, 2021, 2:18 PM IST

భూమి మీద నివసించే జీవుల్లో మానవులకు అత్యంత ప్రమాదకారి ఏది? అని ఎవరినైనా అడిగేతే.. ఒకరు సింహం.. మరొకరు పులి.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా సమాధానం చెబుతారు. ఆ సమాధానాలు నిజమే అయినా.. ఈ జగత్తులో వాటి కంటే ప్రమాదకరమైనవి ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది.

అవి ఏడాదికి వేల నుంచి లక్షల మందిని బలితీసుకుంటున్నాయని ఆ అధ్యయనం చెబుతోంది. ఇంతకీ ఏఏ జీవులు మానవుల పాలిట యమపాశంలా మారాయి. అవి ఏడాదికి ఎంత మందిని చంపుతున్నాయి. హ్యూమన్​ కిల్లర్స్​గా చెప్పుకునే టాప్​-10 జీవుల వివరాలు మీకోసం..

దోమ..

Mosquitoe
దోమ

ప్రపంచంలో ఏడాదికి అత్యధిక మందిని బలి తీసుకుంటూ.. దోమ మొదటి స్థానంలో నిలిచింది. దోమ కాటు ద్వారా వచ్చే మలేరియాతో సంవత్సరానికి ఏకంగా 7,25,000 మంది చనిపోతున్నారు.

మనవుడు..

human
మానవుడు

రెండో ప్రమాదకారి మానవుడు. మనిషి క్రూరత్వానికి ఏటా లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. హత్యలు, హత్యాచారాలు.. ఇలా పలు కారణాలతో ఏడాదికి సగటున నాలుగు లక్షల మంది మానవ మృగానికి బలవుతున్నారు.

పాము..

snake
పాము

పాముకాటు బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఏడాదికి పాము కాటుకు గురై సగటున 1,38,000 మంది ప్రాణాలు విడుస్తున్నారు.

శునకం..

dog
కుక్క

శునకం కాటును తేలికగా తీసుకోవద్దు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది రేబిస్​గా మారే ప్రమాదం ఉంది. రేబిస్​ ద్వారా ఏడాదికి 59వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అస్సాస్సిన్​ బగ్​..

Assassin Bugs
అస్సాస్సిన్​ బగ్

ఇది హెమిప్టెరా జాతికి చెందిన కీటకం. ఇది చాలా ప్రమాదకరమైనవి. ఇది కుట్టడం వల్ల ఏటా 10వేల మంది చనిపోతున్నారు.

తేలు..

Scorpions
తేలు

తేలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది కుట్టిన తర్వాత సకాలంలో చికిత్స అందించకుంటే ప్రాణాలు పోవల్సిందే. తేలు కుట్టి ఏడాదికి సగటున 3,300 మంది కన్నుమూస్తున్నారు.

మొసలి..

Crocodiles
మొసలి

అత్యంత ప్రమాదకరమైన జీవుల జాబితాలో మొసలి కూడా ఉంది. మొసలి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా సగటున ఏడాదికి వెయ్యి మంది ప్రాణాలు పోతున్నాయి.

ఏనుగు..

Elephant
ఏనుగు

మానవులను బలి తీసుకునే జాబితాలో ఏనుగు కూడా ఉంది. వాస్తవానికి ఏనుగును సాదు జంతువు లాగా చాలా మంది భావిస్తారు. అది పొరపాటని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఏనుగు ఏడాదికి సగటున 600 మంది పాలిట యమపాశంగా మారింది.

నీటి ఏనుగు..

Hippos
నీటి ఏనుగు

కొన్ని చోట్ల మాత్రమే నీటి ఏనుగులు కనిపిస్తాయి. మానవుల ప్రాణాలను హరించే విషయంలో ఇవి ముందుంటాయి. ఇవి ఏడాదికి సగటున 500 మందిని చంపుతున్నాయి.

సింహం..

lion
సింహం

సింహం ఎంత క్రూరమైనదో అందరికీ తెలిసిందే. అయితే ఈ జాబితాలో మృగరాజు 10వ స్థానంలో ఉండటం గమనార్హం. ఏడాదికి సింహం 200 మందిని బలి తీసుకుంటోంది.

ఇదీ చూడండి: 'సెప్టెంబర్​ నాటికి కొవాగ్జిన్​ ఉత్పత్తి 10 రెట్లు పెంపు'

ఇదీ చూడండి: కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం!

Last Updated : Apr 20, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.