ETV Bharat / international

విమానాశ్రయం తరహాలో 'డ్రోన్​ పోర్ట్​'- ఎక్కడో తెలుసా? - కార్గో డ్రోన్ల తయారీలో బ్రిటన్ సంస్థ

ప్రపంచంలోనే మొట్టమొదటి 'డ్రోన్​ పోర్ట్' నిర్మించేందుకు బ్రిటన్​ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అర్బన్ ఎయిర్​ పోర్ట్ సంస్థకు 1.6 మిలియన్​ డాలర్ల నిధి కేటాయించినట్లు పేర్కొంది. అధునాతన డ్రోన్​ పోర్ట్​ నిర్మాణంలో భాగంగా ఈ సంస్థ చేపట్టే కార్యకలాపాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

World's first Urban Air Port to be built in the U.K
విమానాశ్రయం మాదిరిగానే 'డ్రోన్​ పోర్ట్​'- ఎక్కడో తెలుసా?
author img

By

Published : Feb 1, 2021, 6:27 AM IST

Updated : Feb 1, 2021, 7:22 AM IST

విమానాశ్రయం తరహాలో 'డ్రోన్​ పోర్ట్​'- ఎక్కడో తెలుసా?

విమానాల రాకపోకల కోసం విమానాశ్రయాలున్నాయి. రైళ్ల కోసం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. కార్ల కోసం పార్కింగ్​ స్థలాలున్నాయి. ఇదే మాదిరిగా సాంకేతికాభివృద్ధి వైపు అడుగులేసే కొన్ని దేశాలు... అధునాతన 'డ్రోన్​ పోర్ట్'​లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.

తాజాగా బ్రిటన్​ కూడా డ్రోన్​ పోర్టు నిర్మాణం కోసం పెద్ద మొత్తం వెచ్చించేందుకు సిద్ధమైంది. కావెంట్రీ సిటీ సరిహద్దుల్లో 'ఎయిర్-వన్' పేరుతో పోర్ట్​ నిర్మాణం చేపట్టేందుకు దాదాపు 1.6 మిలియన్​ డాలర్ల(రూ.11 కోట్ల 66 లక్షలు) నిధులను... 'అర్బన్​ ఎయిర్ పోర్ట్​' సంస్థకు ఇస్తున్నట్లు వెల్లడించింది.

డ్రోన్​ పోర్ట్​ ఉపయోగాలేంటి?

నిర్ణీత ప్రదేశాల్లో వస్తువులను డెలివరీ చేసేందుకు కొన్ని దేశాలు డ్రోన్​లను ఉపయోగించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ తరహా డ్రోన్​లను 'కార్గో డ్రోన్'​లు అంటారు. ఇదే మాదిరిగా మనుషులను మోసుకెళ్లే ఎయిర్​ టాక్సీలను 'ఈవీటోల్స్​' అని అంటారు. అయితే... ఈవీటోల్స్, కార్గో డ్రోన్​లు పూర్తిగా విద్యుత్​ శక్తి సాయంతోనే పనిచేస్తాయి. వీటి రాకపోకల కోసం రన్​వేలు నిర్మించాల్సిన అవసరం కూడా లేదు. ఈ నేపథ్యంలో డ్రోన్​ పోర్ట్​లు నిర్మించేందుకు వివిధ దేశాలు ముందడుగు వేస్తున్నాయి.

బ్రిటన్​ సంస్థ ప్రణాళిక ఏమిటి?

'ఎయిర్​-వన్' ప్రాజెక్టు చేపట్టిన అర్బన్​ ఎయిర్​ సంస్థ... రెండు ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెద్ద కార్గో డ్రోన్​ల తయారీ కోసం మాల్లోయ్​ ఏరోనాటిక్స్​తో, ఈవీటోల్ ఎయిర్​ క్రాఫ్ట్​ తయారీ కోసం హ్యుందాయ్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు పేర్కొంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 2.7 నుంచి 3.4 మిలియన్లు మేరకు ఖర్చు అవుతుందని అర్బన్​ ఎయిర్​పోర్ట్ సంస్థ వ్యవస్థాపకుడు రిక్కీ సంధు చెబుతున్నారు.

"ప్రయాణికులు సరైన మౌలికసదుపాయాలను ఆనందించాలి. విమానం బుక్​ చేసుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వారికి అన్ని ఏర్పాట్లు చేయాలి. దీనికి తగినట్లుగా ప్రాజెక్టు నిర్వహణ జరపాలి. ఐరోపాలోని ఓ సంస్థ 2023 కల్లా పోర్ట్​ నిర్మాణం జరపాలని ప్రయత్నిస్తోంది. అమెరికాలోని ఓ సంస్థ కూడా ఇదే వ్యవధిలో పోర్ట్​ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తోంది. త్వరలోనే మనుషులను తీసుకెళ్లే ఈవీటోల్స్​ రానున్నాయి. బ్రిటన్​ సైతం ఈ ప్రాజెక్టు పనులు ముమ్మురం చేయడం అవసరం."

-రిక్కీ సంధు, అర్బన్​ ఎయిర్​పోర్ట్ వ్యవస్థాపకుడు

రానున్న ఐదు సంవత్సరాల్లో 200లకు పైగా డ్రోన్​ పోర్ట్​లు నిర్మించాలని ఆశాభావంతో ఉంది అర్బన్​ ఎయిర్​ పోర్ట్​ సంస్థ.

ఇదీ చదవండి:తలొగ్గిన పాక్​.. 'డానియేల్​' తీర్పుపై సమీక్ష

Last Updated : Feb 1, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.