ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 2కోట్ల 81 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 9లక్షల 9వేల మందికిపైగా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా.. రికవరీల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ 2 కోట్ల మార్కును దాటింది.
- కరోనా కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 65.53 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 1.95 లక్షల మంది కొవిడ్‌తో మరణించారు.
- బ్రెజిల్లో ఇప్పటివరకు 44.94 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 75వేల మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 5,363 కరోనా కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 10,46,370కు ఎగబాకింది. తాజాగా 128 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 18,263 కు చేరింది.
- మెక్సికోలో తాజాగా 4,647 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 6,47,507కు పెరిగింది. మరో 611 మంది వైరస్ బారినపడి చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 69,095కు ఎగబాకింది.
- పాక్‌లో కొత్తగా 426 మందికి కొవిడ్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,365 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
- పొరుగు దేశం నేపాల్‌లో కరోనా కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. తాజాగా 1,246 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 393 మంది కొవిడ్ తో మృతిచెందారు.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 65,53,538 | 1,95,318 |
భారత్ | 44,94,389 | 75,328 |
బ్రెజిల్ | 41,99,332 | 1,28,653 |
రష్యా | 10,46,370 | 18,263 |
పెరూ | 70,2776 | 22,053 |
ఇదీ చదవండి: అంతరిక్షంలోకి కల్పనా చావ్లా పేరుతో వ్యోమనౌక