జర్మనీకి చెందిన ఓ మహిళను అదృష్టం వరించింది. లాటరీలో విజేతగా నిలిచిన ఆమెకు 39 మిలియన్ డాలర్లు (రూ.290 కోట్లు) జాక్‌పాట్ తగిలింది. జూన్ 9న తీసిన డ్రాలో ఆమె ఒక్కరే విజేతగా నిలిచినట్లు లాటరీ అధికారులు తెలిపారు.
అయితే విషయం తెలియక.. ఆ టికెట్‌ను తన హ్యండ్ బ్యాగ్‌లో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు. లాటరీ తగిలిందని తెలియగానే షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు.
"నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. 33 మిలియన్ యూరోల విలువైన లాటరీ టికెట్‌ను నా హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకుని కొన్ని వారాలపాటు ఎంతో నిర్లక్ష్యంగా తిరిగాను. అయితే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. దీంతో నా కుటుంబం సంతోషంగా జీవిస్తుంది."
- లాటరీ విజేత
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, పర్యావరణం పరిరక్షణ కోసం ఈ డబ్బును ఉపయోగించాలని యోచిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మనసును తాకిన ప్రపోజల్.. ప్రియుడిపై ముద్దుల వర్షం