నీరవ్‌మోదీని భారత్‌కు అప్పగిస్తే విజయ్‌మాల్యాతో కలిపి ఒకే జైలు గదిలో ఉంచుతారా? అని భారత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు లండన్ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మా ఆర్బథ్నాట్. శుక్రవారం నీరవ్ రెండో బెయిల్ పిటిషన్‌పై వాదనలు మొదలైన కొద్దిసేపటికే న్యాయమూర్తి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భారత్‌లోని ఏ ప్రాంతంలో నీరవ్మోదీను ఉంచుతారో మీకు తెలుసా' అని న్యాయవాదిని ప్రశ్నించింది కోర్టు.
భారత్ తరఫు వాదనలు వినిపిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్... జస్టిస్ ఎమ్మా ప్రశ్నకు సమాధానమిచ్చారు. విజయ్‌మాల్యా కోసం ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో సిద్ధం చేస్తున్న గదిలోనే ఉంచే అవకాశాలున్నాయని తెలిపారు.
'విజయ్‌మాల్యా కోసం ఏర్పాటు చేసిన గది వీడియో చూశాం. అందులో నీరవ్‌కు సరిపడా స్థలం ఉంది' అని ప్రతిస్పందనగా న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లండన్ కోర్టులో మాల్యా జైలు గది వీడియో
విజయ్‌మాల్యా భారత బ్యాంకులకు దాదాపు రూ.9 వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్నారు. కింగ్‌ఫిషర్ అధినేతను భారత్‌కు అప్పగిస్తే అత్యంత భద్రతతో కూడిన ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఖైదు చేస్తామని భారత ప్రభుత్వం లండన్ కోర్టుకు గతంలో తెలిపింది. గది వీడియోను కోర్టుకు సమర్పించింది.
నీరవ్‌మోదీ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
పీఎన్బీ కుంభకోణం ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ రెండో బెయిల్ పిటిషన్‌ను లండన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 26కు వాయిదా వేసింది.