ప్రజలంతా బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కు పెట్టుకోవాలని.. అప్పుడే కొవిడ్ విజృంభించకుండా ఉంటుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నిపుణులు తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిన అంశాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఏ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
లాక్‌డౌన్‌లతో పాటు.. ప్రజలంతా మాస్కు పెట్టుకోవడాన్ని అలవాటు చేసుకుంటేనే ఫలితాలుంటాయని అధ్యయనం తేల్చింది. కరోనా వైరస్ మళ్లీ మళ్లీ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఒక్క లాక్‌డౌన్‌లు మాత్రమే సరిపోవని స్పష్టం చేసింది. లక్షణాలు లేనప్పటికీ.. కనీసం ఇంటివద్ద తయారు చేసుకున్న మాస్కులైనా వేసుకోవచ్చని, దీనిద్వారా వ్యాప్తిని గణనీయంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కులు, భౌతిక దూరంతో పాటు లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తే మహమ్మారిని అదుపు చేయవచ్చని, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించవచ్చని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రజలు మాస్కులు ధరించినప్పుడు.. ఇతర సందర్భాల్లోనూ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం జరిపారు. అత్యధిక శాతం మంది మాస్కులు పెట్టుకున్న సందర్భాల్లో కొవిడ్ వ్యాప్తి తక్కువ ఉన్నట్లు తేలింది.
ఇదీ చూడండి: అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్కు చోటు