ETV Bharat / international

టీకా సరే.. 'ప్రణాళిక' అమలు అంత సులభమా?

ఫైజర్​ టీకా పంపిణీకి బ్రిటన్​ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ ప్రణాళికను రచించింది. వ్యాక్సిన్​ చేతికి అందిన కొద్ది రోజుల నుంచే ఈ ప్రణాళిక అమలవుతుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులభమైన విషయంగా కనిపించడం లేదు. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. అసలు ఆ ప్రణాళిక ఏంటి? అడ్డంకులేంటి?

Who, when and how? A look at the UK's vaccination rollout
బ్రిటన్​ 'ఫైజర్​' ప్రణాళిక అమలు అంత సులభమా?
author img

By

Published : Dec 3, 2020, 2:21 PM IST

ఫైజర్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చిన తొలి దేశంగా బ్రిటన్​ నిలిచింది. రానున్న వారాల్లో ప్రజలకు టీకాను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ ప్రణాళికను రూపొందించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులభమైన విషయమా? ఇందులో అడ్డంకులున్నాయా? అసలు బ్రిటన్​ ప్రణాళిక ఏంటి?

బ్రిటన్​ వద్ద ఎన్ని వ్యాక్సిన్​ డోసులున్నాయి?

40 మిలియన్​ డోసుల కోసం ఆర్డర్లు ఇచ్చింది బ్రిటన్​. కానీ అవి సరిపోవు. ఒక్కరికి రెండేసి డోసులు ఇవ్వాల్సిన నేపథ్యంలో.. 20మిలియన్​ మందికే వ్యాక్సిన్​ అందుబాటులో ఉంటుంది. 16ఏళ్లు పైబడిన వారికే టీకా వేయించాలని బ్రిటన్​ నిర్ణయించుకున్నప్పటికీ.. మరో 53మిలియన్​ డోసులుకుపైగా అవసరం ఉంది.

వ్యాక్సిన్​ ఎప్పుడు బయటకొస్తుంది?

బెల్జియం నుంచి వచ్చిన కొన్ని రోజులకు ఫైజర్​ వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకురావాలన్నది బ్రిటన్​ ప్రణాళిక. వచ్చే వారంలో 8లక్షల డోసులు బ్రిటన్​కు చేరుకుంటాయని ఆ దేశ ఆరోగ్యశాఖ కార్యదర్శి మ్యాట్​ హెన్​కాక్​ ప్రకటించారు. మిగిలిన వాటి కోసం వేచిచూడాలి.

బ్రిటన్​ ప్రణాళిక పనిచేస్తుందా?

ప్రణాళిక అమలు చేయడం అంత సులభమైన విషయం కాదు. -70 డిగ్రీల వద్ద టీకాను నిల్వ ఉంచి, పంపిణీ చేయాలి. ఇదే అతిపెద్ద సమస్య. అయితే రిఫ్రిజిరేటర్​లోని సాధారణ ఉష్ణోగ్రతల్లో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచగలిగే అవకాశం ఉండటం సానుకూల అంశం. వ్యాక్సిన్​ పంపిణీ కోసం నేషనల్​ హెల్త్​ సర్వీస్​ను ఉపయోగించుకోవాలని చూస్తోంది బ్రిటన్​. స్థానిక వైద్యులు, వ్యాక్సినేషన్​ సెంటర్లను కూడా వాడుకోవాలని చూస్తోంది.

ఇదీ చూడండి:- 'ఆ వ్యాక్సిన్​ను నిల్వ చేయటం పెద్ద సవాలే'

ఎంత కాలం పడుతుంది?

ప్రణాళిక పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అవసరానికి సరిపడా ఫైజర్​ టీకా డోసులు ప్రస్తుతం బ్రిటన్​ వద్ద లేవు. మరో రెండు టీకా సంస్థలతో చర్చలు జరుపుతోంది. అవి మోడెర్నా, ఆక్స్​ఫర్డ్​ టీకాలు. మోడెర్నా మంచి ఫలితాలే ఇస్తున్నప్పటికీ ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ తక్కువ ప్రభావితమని నివేదికలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి:- శుభవార్త: 94.5% ప్రభావవంతంగా మోడెర్నా టీకా!

'వ్యాక్సిన్​ తప్పనిసరి' చేస్తుందా?

'వ్యాక్సిన్​ను వేసుకోవడం తప్పనిసరి' అనే నిబంధనను బ్రిటన్​ తీసుకురాకపోవచ్చు. అయితే అందరూ టీకా వేసుకోవాలని ప్రభుత్వం, ప్రజా ఆరోగ్య సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

తొలుత వ్యాక్సిన్​ అందేది ఎవరికి?

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నవారికే టీకా అందుతుంది. కొవిడ్​-19తో మృతిచెందే ప్రమాదం ఎక్కువ ఉన్న వారికే తొలి ప్రాధాన్యతనివ్వాలని.. 'వ్యాక్సినేషన్​ అండ్​ ఇమ్యునేషన్'​పై ఏర్పాటు చేసిన స్వతంత్ర సంయుక్త కమిటీ.. బ్రిటన్​ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నర్సింగ్​హోంలలో ఉన్న వృద్ధులు(80ఏళ్లు), పెద్దవారు, ఆరోగ్య సిబ్బందికి తొలుత ఈ టీకా అందనుంది.

ఆ తర్వాత ఎవరికి?

75ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్లు అందించాలి. ఆ తర్వాత 70ఏళ్లుపైబడినవారికి ఇవ్వాలి. తొలి దశ వ్యాక్సినేషన్​ కోసం మొత్తం 9బృందాలను ఏర్పాటు చేసింది బ్రిటన్​. వీరిలో 50ఏళ్లుపైబడి వారు ఉన్నారు.

వ్యాక్సినేషన్​ ప్రణాళికను ఖరారు చేశారా?

ప్రణాళికను ఇంకా ఖరారు చేయలేదు. ఇందులో ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ముఖ్యంగా.. నర్సింగ్​హోంలకు ఫైజర్​ టీకాను ఎలా పంపిణీ చేయాలన్నదానిపై స్పష్టత లేదు.

ఇదీ చూడండి:- మోడెర్నా, ఫైజర్‌ కంటే తక్కువ ధరలోనే..!

రెండు డోసుల తర్వాత పరిస్థితేంటి?

రెండు డోసులు వేసుకున్న నెల రోజులకు మనిషిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. టీకాపై ఉన్న డేటాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. తొలి డోసు తర్వాతే రోగనిరోధక శక్తి పాక్షికంగా పెరుగుతుంది. అయితే రెండు టీకాలు వేసుకున్న వారం రోజుల్లోనే ఇమ్యూనిటీ పెరుగుతుందని బ్రిటన్​ అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందన్నది ఇంకా ప్రశ్నార్థకమే.

దీర్ఘకాల ప్రణాళిక సంగతేంటి?

ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టినప్పుడే.. ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. వార్షికంగా టీకా వేయించుకోవాలా? లేక రెండు డోసులు సరిపోతాయా? అన్న ప్రశ్నలకు కూడా ఇప్పట్లో సమాధానం దొరకదు. సైడ్​-ఎఫెక్ట్స్​పైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు బ్రిటన్​ ఏర్పాట్లు చేస్తోంది.

టీకా ప్రణాళికపై అనుమానాలు వస్తే?

టీకా ప్రణాళికను సరిగ్గా అమలు చేయడం ఎంతో కీలకమని.. దాని ద్వారా వ్యాక్సిన్​పై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టీకా ప్రణాళికలు అమలు చేయడానికి సమాజంలోని గౌరవప్రదమైన వారిని నియమించుకునేందుకు చూస్తోంది ప్రభుత్వం.

ఇదీ చూడండి:- 'ఏప్రిల్​ నాటికి సాధారణ ప్రజలకు టీకా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.