ETV Bharat / international

WHO: ఆంక్షలు సడలించే ముందు జాగ్రత్త - కొవిడ్​ నిబంధనల సడలింపు

కొవిడ్​-19 ఆంక్షలను పూర్తి స్థాయిలో సడలించడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అత్యవసర వైద్య సేవలు)​ డాక్టర్​ మైకేల్ రేయన్​ హెచ్చరించారు. ఈ నిర్ణయంతో వైరస్​ వ్యాప్తి మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ, డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Jul 8, 2021, 5:51 AM IST

కొవిడ్​ ఆంక్షలు పూర్తి స్థాయిలో సడలించడం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్​ మైకేల్ రేయన్ హెచ్చరించారు. కొవిడ్​ కట్టడిలో భాగంగా చేపట్టిన చర్యలను సడలించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. వైరస్​ వ్యాప్తి మళ్లీ పెరిగే అవకాశముందని అన్నారు.

బ్రిటన్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఆంక్షలను ఎత్తేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడిన డాక్టర్​ మైకేల్ రేయన్.. అన్ని దేశాలు ఏదో ఒక రూపంలో లాక్​డౌన్​ను సడలిస్తున్నాయని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పడం, వైరస్​ వ్యాప్తి చెందకుండా చూడటం మధ్య సమతౌల్యాన్ని పాటించాల్సి ఉందని తెలిపారు.

వైరస్​లో మార్పులు వస్తుండటం, సామాజిక జాగ్రత్తలు పాటించకపోవడం, అందరికీ టీకాలు అందకపోవడం ముప్పుగా పరిణమించిందని డబ్ల్యూహెచ్​ఓ కరోనా వ్యవహారాల నిపుణురాలు మారియా వాన్ ఖెర్కోవ్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'అలా చేస్తేనే కరోనాపై విజయం సాధ్యం!'

'చాలా ప్రమాదకరమైన కాలంలో ప్రపంచం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.