ETV Bharat / international

'కరోనా టీకా కొనుగోలు ఒప్పందాలను ఆపండి' - కరోనా తయారీ సంస్థలతో ధనిక దేశాలు ఒప్పందాలు పెట్టకోవద్దు

కరోనా వాక్సిన్​ కొనుగోలు కోసం టీకా తయారీ సంస్థలతో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోవద్దని డబ్ల్యూహెచ్​ఓ కోరింది. ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల పేద దేశాలకు టీకా పంపిణీ చేయాలన్న ఐక్యరాజ్య సమితి ఆశయం దెబ్బతింటుందని పేర్కొంది.

WHO: Rich nations, vaccine firms should stop bilateral deals
'కరోనా టీకా తయారి సంస్థలతో ఆ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవద్దు'
author img

By

Published : Jan 9, 2021, 8:39 AM IST

కరోనా టీకా కొనుగోలు కోసం ధనిక దేశాలు.. వాక్సిన్​ తయారీ సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఒప్పందం పెట్టుకోవడం వల్ల ప్రపంచమంతటికీ టీకా ఇవ్వాలనే ఐక్యరాజ్యసమితి ఆశయం దెబ్బతింటుందని తెలిపింది.

ప్రస్తుతం ధనిక దేశాలు, సాధరణ ఆదాయం ఉన్న 42 దేశాలు.. కరోనా టీకాను కొనుగోలు చేయాలని చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (బ్ల్యూహెచ్​ఓ) డెరక్టర్​ జనరల్​ టెడ్రోస్​ అథనోమ్​ అన్నారు. అవసరానికి మించి ఆ దేశాల దగ్గర టీకాలుంటే ఐక్యరాజ్య సమితికి ఇవ్వాలని కోరారు. తద్వారా మరిన్ని పేద దేశాలకు వాక్సిన్​ను ఐక్యరాజ్య సమితి పంపిణీ చేయగలుగుతుందని వెల్లడించారు.

"కరోనా టీకా కొనుగోలుపై వాక్సిన్​ తయారీ సంస్థలతో ధనికదేశాలు ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోవద్దని కోరుతున్నా. ఒక వేళ అలా జరిగితే వాక్సిన్​ ధర పెరుగుతుంది. అంత ఖర్చు పెట్టి పేద దేశాలు టీకా కొనలేవు. దాంతో అందరికీ వాక్సిన్​ ఇవ్వాలన్న ఐక్యరాజ్య సమితి ఆశయం దెబ్బతింటుంది."

-టెడ్రోస్​ అథనోమ్​​, డబ్ల్యూహెచ్​ఓ డైరక్టర్​ జనరల్​

అంతేకాకుండా టీకా తయారీ సంస్థల దగ్గర ఎన్ని టీకాలు ఉన్నాయో యూఎన్​ఓకు చెప్పాలని కోరారు టెడ్రోస్​. తద్వారా అత్యవసరంగా టీకా ఇవ్వాల్సిన దేశాలకు, వ్యక్తులకు వాక్సిన్​ అందించాల్సిన జాబితాను రూపొందించడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'డోసుల మధ్య వ్యవధి 6 వారాలు ఉండొచ్చు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.