ETV Bharat / international

మలేరియా కట్టడిలో ముందడుగు-అందుబాటులోకి టీకా! - malaria vaccine for children

శతాబ్దాలుగా దేశదేశాలను వణికిస్తున్న విషజ్వరం వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగే 'ఆర్టీఎస్‌,ఎస్‌' టీకా విస్తృత వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసింది. పసివారిలో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ మలేరియా నివారణే లక్ష్యంగా మూడు దశాబ్దాలుగా సాగుతున్న శాస్త్ర పరిశోధనలకు ఫలశ్రుతి ఇది! స్వచ్ఛంద సంస్థ 'పాథ్‌', ఆఫ్రికాలోని పరిశోధన కేంద్రాలతో కలిసి బ్రిటిష్‌ బహుళజాతి ఔషధ సంస్థ 'జీఎస్‌కే' చేపట్టిన పరిశోధనలకు గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం తోడై.. మొట్టమొదటి మలేరియా టీకా 'ఆర్టీఎస్‌,ఎస్‌' ఆవిష్కృతమైంది.

malaria vaccine
మలేరియా టీకా
author img

By

Published : Oct 9, 2021, 5:02 AM IST

మలేరియా పరాన్నజీవిపై పోరులో మానవాళికి గొప్ప శుభవార్తగా కీలక ముందడుగు పడింది. శతాబ్దాలుగా దేశదేశాలను వణికిస్తున్న విషజ్వరం వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగే 'ఆర్టీఎస్‌,ఎస్‌' టీకా విస్తృత వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా సిఫార్సు చేసింది. పసివారిలో ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్‌ మలేరియా నివారణే లక్ష్యంగా మూడు దశాబ్దాలుగా సాగుతున్న శాస్త్ర పరిశోధనలకు ఫలశ్రుతి ఇది! స్వచ్ఛంద సంస్థ 'పాథ్‌', ఆఫ్రికాలోని పరిశోధన కేంద్రాలతో కలిసి బ్రిటిష్‌ బహుళజాతి ఔషధ సంస్థ 'జీఎస్‌కే' చేపట్టిన పరిశోధనలకు గేట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సాయం తోడై- మొట్టమొదటి మలేరియా టీకా 'ఆర్టీఎస్‌,ఎస్‌' ఆవిష్కృతమైంది. పైలట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా ఘనా, కెన్యా, మలావీ దేశాల్లోని ఎనిమిది లక్షల చిన్నారులకు దాన్ని అందించారు. సుమారు 23 లక్షల డోసులు పంపిణీ చేసి, ఫలితాల్ని విశ్లేషించారు. వ్యాధి నుంచి రక్షణ కల్పించడంలో టీకా సామర్థ్యం గణనీయమని నిగ్గుతేలింది. నిధులు సమకూర్చుకుని వ్యాక్సిన్‌ ఉత్పత్తిని ఇతోధికం కావించడం, ఆయా దేశాల మలేరియా నియంత్రణ వ్యూహాల్లో దాన్ని అంతర్భాగం చేయడం తదుపరి చర్యలుగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ప్రపంచ మలేరియా నివేదిక-2020 వెల్లడించిన మేరకు 2019లో 22.9 కోట్ల మంది ఆ విషజ్వరం కోరల్లో చిక్కారు. 4.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో అత్యధికులు ఆఫ్రికన్‌ చిన్నారులే! వైద్య చికిత్సల వ్యయం, ఉత్పాదకత నష్టాలను లెక్కలోకి తీసుకొంటే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 90 వేల కోట్ల రూపాయలను మలేరియా పరాన్నజీవి మింగేస్తోంది! ఔషధాలకు తట్టుకుంటూ అది మొండిఘటంగానూ మారుతోంది. ఈ తరుణంలో అందుబాటులోకి వచ్చిన టీకా- ఏటా కొన్ని లక్షల మందికి ప్రాణదీపం కాబోతోంది. జీఎస్‌కే, పాథ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ బయోటెక్‌ ప్రముఖ పాత్ర పోషించనుంది. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అభివర్ణించినట్లు.. మలేరియా టీకా ఆవిష్కరణ ఒక చరిత్రాత్మక ఘట్టం!

భారతదేశంలో మలేరియా కేసులు గడచిన రెండు దశాబ్దాల్లో రెండు కోట్ల నుంచి 56 లక్షలకు దిగివచ్చినట్లు డబ్లూహెచ్‌ఓ లోగడ నివేదించింది. 2015-20 మధ్య దేశీయంగా వ్యాధి వ్యాప్తి 84.5శాతం, మరణాలు 83.6శాతం తగ్గిపోయాయని గత జులైలో పార్లమెంటులో కేంద్రం ప్రకటించింది. 2030 నాటికి ఇండియా నుంచి మలేరియాను పూర్తిగా పారదోలాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలోనే సత్ఫలితాలు సాధించామని సర్కారు సెలవిస్తున్నా- క్షేత్రస్థాయిలో తద్భిన్నమైన దుర్భర దృశ్యాలు తాండవిస్తున్నాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మలేరియా విజృంభణ వివరాలు, సంభవిస్తున్న మరణాలు అధికారిక రికార్డుల్లోకి ఎక్కడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. వ్యాధి నియంత్రణకు ఉద్దేశించిన నిధుల్లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలు, పాలన ఖర్చులకే సరిపోతున్నట్లు లోగడే వెల్లడైంది. ఏపీలో విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు; తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ ఏడాదిలోనే వందల కొద్దీ విషజ్వరాల కేసుల వెలుగుచూశాయి. పరిశుభ్రతకు పట్టంకట్టి శ్రీలంక వంటి చిన్నదేశాలు సైతం మలేరియా నుంచి స్వేచ్ఛను సాధిస్తే- తద్భిన్నమైన పోకడలతో ఇండియా రుజాగ్రస్తమవుతోంది. మేటవేస్తున్న చెత్తకుప్పలు, పొంగిపొర్లుతున్న మురుగునీళ్లతో పట్టణభారతంలోనూ మశకసంతతి స్వైరవిహారం చేస్తోంది. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తికి గొడుగుపడుతూ, కొత్తగా వచ్చిన టీకాను అందిపుచ్చుకొని మారుమూల ప్రాంతాలకు వైద్యసేవలను విస్తరిస్తూ ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలి. విషజ్వరాలు, అంటురోగాల కబంధహస్తాల నుంచి దేశాన్ని రక్షించుకోగలిగే సమర్థ వ్యూహమదే!

ఇదీ చూడండి: Camphor uses : కర్పూరం ప్రయోజనాలేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.