ETV Bharat / international

WHO Omicron: 'ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్​'

WHO Omicron: కొవిడ్​ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్​ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్​తో ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి, మరణాలు తక్కువగా ఉన్నంత మాత్రానా.. ఇతర దేశాల్లో ఇదే తరహాలో ఉంటుందని భావించకూదన్నారు.

WHO Omicron
WHO Omicron
author img

By

Published : Jan 5, 2022, 5:16 AM IST

WHO Omicron: ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వణికిస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్​తో ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి, మరణాలు తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్​ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ ఇదే తరహాలో ఉంటుందని భావించలేమన్నారు. ఒమిక్రాన్ స్వభావం,​ తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని చెప్పారు.

"దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్​తో ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఒమిక్రాన్ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. ఇదే తరహాలో ఇతర దేశాల్లో ఉండకపోవచ్చు" అని మహముద్​ పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్​లో సాంక్రమిక శక్తి కనిపిస్తోందని చెప్పారు. అమెరికాలో కొవిడ్ కేసుల విపరీతంగా నమోదవుతున్నాయని గుర్తు చేశారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుందన్నారు. ఇంతకముందు వేరియంట్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్​ శరీర పైభాగంపై ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరిన్ని అధ్యయనాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

ఈ వేరియంట్ ఇప్పటివరకు 128 దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

ఇదీ చూడండి: ఫ్రాన్స్​లో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.