కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు యావత్ ప్రపంచం తీవ్రంగా శ్రమిస్తోంది. వైరస్ ప్రభావం తగ్గిన కొన్ని దేశాల్లో ఆంక్షలు సడలిస్తున్నారు. అయితై వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసస్ హెచ్చరించారు.
1918లో 10 కోట్ల మందిని బలిగొన్న స్పానిష్ ఫ్లూ మహమ్మారిని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం సాంకేతికత అందుబాటులో ఉన్నందున దాన్ని నిర్మూలించగలమని విశ్వాసం చేశారు. వైరస్ కారణంగా తీవ్ర పరిణామాలు ముందున్నాయన్నారు. చాలా మందికి అర్థం కాని కరోనాను నిర్మూలించాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.