ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్.. రెండోసారి ఆ పదవికి(WHO Chief) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గడువు సెప్టెంబరు 23న ముగిసిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ మేరకు శుక్రవారం ప్రకటించింది. వచ్చే ఏడాది మేలో నిర్వహించే వార్షిక సమావేశాల్లో టెడ్రోస్‌ను అధికారికంగా రెండోసారి ఎన్నుకోనున్నారు.
డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్(WHO Chief Tedros) 2017లో బాధ్యతలు చేపట్టారు. ఇథియోపియా దేశస్థుడైన ఆయన.. ఈ పదవి చేపట్టిన తొలి నల్లజాతీయునిగా గుర్తింపు పొందారు. వైద్యుడు కాకుండానే డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఆయనే కావడం గమనార్హం. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా రెండో దఫా ఎన్నిక కోసం టెడ్రోస్ పేరును జర్మనీ, ఫ్రాన్స్ నామినేట్ చేశాయి.
ఇవీ చూడండి: