టీకాలకు అత్యవసర ఆమోదం ఇస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియా.. కరోనా మహమ్మారి అంతం దిశగా సంకల్పించిందని ప్రశంసించారు.
'ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా టీకా ఉత్పత్తిదారు అయిన భారత్.. నిర్ణయాత్మక చర్య తీసుకుంది. కొవిడ్ అంతానికి ఇది దోహదపడుతుంది.' అని టెడ్రోస్ ట్వీట్ చేశారు.
కరోనాపై పోరులో భాగంగా ప్రధాని మోదీ చేసిన కృషిని టెడ్రోస్ ప్రశంసించారు. "మనం కలిసి ఉంటే.. సమర్థవంతమైన, సురక్షితమైన టీకా అందించగలం" అంటూ మోదీని ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
ఇదీ చదవండి: దేశంలో మహమ్మారి తీవ్రత తగ్గడానికి కారణాలివేనా..?