ETV Bharat / international

కరోనా తీర్మానానికి భారత్​ మద్దతు- అమెరికా దూరం

కరోనా పుట్టుపూర్వోత్తరాలు సహా వైరస్​ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవహార శైలిపై నిస్పాక్షిక దర్యాప్తు జరగాలని ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ సహా 120 దేశాలు మద్దతు పలికాయి. డబ్ల్యూహెచ్​ఓ 73వ సమావేశాల్లో ఐరోపా సమాఖ్య ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే అమెరికా మాత్రం ఈ తీర్మానానికి మద్దతు పలకకపోవడం కొసమెరుపు.

who
డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : May 18, 2020, 6:36 PM IST

కొవిడ్ ఉద్భవించిన తీరు సహా వైరస్ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) తీరుపై నిస్పాక్షిక దర్యాప్తు చేపట్టాలన్న ప్రతిపాదనకు భారత్​ మద్దతు పలికింది. ఈ నిర్ణయానికి సమ్మతించిన 120 దేశాల సరసన చేరింది.

జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్​ఓ 73వ సమావేశాల్లో భాగంగా ఐరోపా సమాఖ్య ప్రవేశపెట్టిన ఈ ముసాయిదా తీర్మానానికి చాలావరకు దేశాలు మద్దతిచ్చాయి. కొవిడ్​పై స్పందించిన తీరు, గడించిన అనుభవాలపై నిస్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర మదింపు చేపట్టాలని స్పష్టం చేశాయి.

వైరస్ ఆనవాళ్లు తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా శాస్త్రీయ దర్యాప్తు అవసరమని తీర్మానంలో పేర్కొంది ఈయూ. మధ్యవర్తుల పాత్రపైనా మదింపు చేయాలని ప్రతిపాదించింది. అయితే వైరస్​ ఉద్భవించిన చైనా పేరును తీర్మానంలో ప్రస్తావించలేదు.

భారత్​తో పాటు, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, కెనడా, చిలీ, జపాన్, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్, రష్యా, యూకే సహా తదితర దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచాయి. అయితే చైనాపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న అమెరికా మాత్రం ఈ జాబితాలో లేదు.

చైనా 2 బిలియన్ డాలర్ల సాయం

డబ్ల్యూహెచ్​ఓ తీర్మానం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జన్యు క్రమం సహా వైరస్​ సమగ్ర సమాచారాన్ని డబ్ల్యూహెచ్​ఓతో పాటు ఇతర దేశాలకు సరైన సమయంలో అందించినట్లు స్పష్టం చేశారు. నియంత్రణ చర్యలు, చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని అన్నిదేశాలతో పంచుకున్నట్లు తెలిపారు.

కరోనాపై పోరాటానికి భారీ సాయాన్ని ప్రకటించారు జిన్​పింగ్. రానున్న రెండేళ్లలో 2 బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.