ETV Bharat / international

గాలి ద్వారానూ కరోనా.. కొట్టిపారేయలేం: డబ్ల్యూహెచ్‌ఓ - covid-19 latest news

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని సంస్థ ప్రతినిధి ఒకరన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.

WHO acknowledges evidence emerging of airborne
గాలి ద్వారానూ కరోనా.. కొట్టిపారేయలేం: డబ్ల్యూహెచ్‌ఓ
author img

By

Published : Jul 8, 2020, 2:38 PM IST

కరోనా మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. దీనికి సంబంధించి తాజాగా వెలువడుతున్న ఆధారాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయంటూ ఇటీవల వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి సంబంధించిన మార్గదర్శకాల్ని సవరించాలని వారు కోరారు.

"జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, గాలి, వెలుతురు సరిగా లేని ప్రదేశాల్లో గాలిద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేం. అయితే, దీనికి సంబంధించిన మరిన్ని బలమైన ఆధారాల్ని సేకరించి విశ్లేషించాల్సి ఉంది. ఆ దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ బెనిడెట్టా అలెగ్రాంజీ వివరించారు. గాలి ద్వారా, చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని సంస్థ మరో ప్రముఖ ప్రతినిధి వాన్‌ కెర్ఖోవ్‌ అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు.

గాలి ద్వారా వ్యాపిస్తుందన్న శాస్త్రవేత్తల వాదన డబ్ల్యూహెచ్‌వోతో విభేదించడం కాదని బృందంలో ఓ సభ్యుడైన కొలరెడో విశ్వవిద్యాలయానికి చెందిన రసాయన రంగ నిపుణుడు జోస్‌ జిమెనెజ్‌ అన్నారు. ఈ వాదనను పరిగణించాలని మాత్రమే తాము కోరినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే లేఖ రాశామని తెలిపారు. అనేక చర్చల తర్వాత కూడా డబ్ల్యూహెచ్‌వో మా ఆధారాల్ని అంగీకరించడానికి నిరాకరించడంతో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని వివరించారు. అయితే, గాలి ద్వారా, అతి చిన్న తుంపర్ల కారణంగా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనను వైద్య వర్గాలు అనాదిగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయని తెలిపారు. ఈ వాదన రుజువు చేయడానికి బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతాయన్న కారణంతోనే ఈ విషయాన్ని బహిర్గతం చేయరని వివరించారు. అలాగే, వైద్యులు సైతం చికిత్స చేయడానికి వెనకాడే ప్రమాదం ఉందన్నారు.

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని రుజువైతే ఇప్పటి వరకు మహమ్మారి కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు మరింత పకడ్బందీగా అమలయ్యేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వాలు సైతం తమ వైద్య విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: టార్గెట్​ చైనా: 'ఇండో పసిఫిక్'​పై భారత్​- అమెరికా చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.