ETV Bharat / international

ఆ విటమిన్​ లోపంతోనే కరోనా తీవ్ర ప్రభావం!

author img

By

Published : May 9, 2020, 9:54 AM IST

విటమిన్​- డి సగటు తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు రేటు అధికంగా ఉందని పరిశోధకులు గుర్తించారు. శ్వాసకోశ వ్యాధులను విటమిన్​- డి ఎదుర్కోగలదని తెలిపారు. వృద్ధుల్లో ఈ విటమిన్​ తక్కువగా ఉండటం వల్లనే వారిపై కరోనా అధిక ప్రభావం చూపిస్తోందని చెబుతున్నారు.

VIRUS-IMMUNITY-VITAMIN D
విటమిన్​- డి

కరోనా మరణాల రేటు, విటమిన్​-డి స్థాయి మధ్య సంబంధాన్ని గుర్తించారు పరిశోధకులు. విటమిన్​-డి స్థాయి సగటు తక్కువ ఉన్న 20 ఐరోపా దేశాల్లో మరణాల రేటు అధికంగా ఉందని నిర్ధరించారు. దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు సిద్ధమయ్యారు.

కరోనా బాధితుల్లో సైటోకైన్లు అనే తాపజనక కణాలు (ఇన్​ఫ్లమేటరీ మాలిక్యూల్స్​)ను తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి చేస్తాయి. విటమిన్​-డి వీటి ఉత్పత్తిని నిరోధిస్తున్నట్లు తాజా పరిశోధనల్లో తేలింది. విటమిన్​-డి స్థాయి తక్కువ ఉన్న వారిలో శ్వాసకోశ వ్యాధులు తీవ్రంగా ఉన్నట్లు గతంలోనూ పరిశోధకులు గుర్తించారు.

ఉత్తర, దక్షిణాల్లో తేడా..

ఐరోపాలో దేశాలవారీగా అధ్యయనం చేసిన పరిశోధకులు ఒక అంచనాకు వచ్చారు. ఇటలీ, స్పెయిన్​లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. ఉత్తర ఐరోపా కన్నా ఈ దేశాల్లోనే విటమిన్​-డి స్థాయి తక్కువ ఉంటుంది.

కారణం.. దక్షిణ ఐరోపాలో ముఖ్యంగా వృద్ధులు సూర్యరశ్మికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. చర్మ వర్ణం కూడా సహజంగా లభించే విటమిన్​-డిని స్వీకరించనివ్వదు.

అదే ఉత్తర ఐరోపాలో విటమిన్​-డి స్థాయి అధికంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు కాడ్​ లివర్ నూనె వంటి విటమిన్​-డి అధికంగా ఉండే పదార్థాలు, సూర్య రశ్మిని స్వీకరిస్తారు. ఇందులోని స్కాండినేవియా దేశాల్లో (నార్వే, స్వీడన్, డెన్మార్క్​) మరణాల రేటు మరీ తక్కువగా నమోదైంది.

"ఆసుపత్రిలో చేరినవారిలో 75 శాతం మందికి విటమిన్​-డి లోపం ఉన్నట్లు ఇదివరకు చేసిన అధ్యయనంలో గుర్తించాం.ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తే విటమిన్​-డి స్థాయికి, కరోనా మరణాల రేటు మధ్య సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్​- డి రక్షిస్తుంది. అందువల్లనే విటమిన్​ తక్కువగా ఉండే వృద్ధులపై కరోనా ప్రభావం అధికంగా చూపిస్తోందని భావిస్తున్నాం. "

- లీ స్మిత్, పరిశోధకుడు

తమ బృందం చేసిన పరిశోధన చాలా పరిమితమైనదని లీ స్మిత్ అన్నారు. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకుని విటమిన్​- డి ప్రభావంపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ప్రతి దేశంలో కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి ఆయా దేశాలు నిర్వహిస్తున్న నిర్ధరణ పరీక్షలు, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆధారపడి ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.