ETV Bharat / international

నిమిషాల్లోనే కరోనా పరీక్షలా? కచ్చితత్వం ఎంత? - నిమిషాల్లోనే కరోనా పరీక్ష

కరోనా విజృంభణ నేపథ్యంలో పలు సంస్థలు నిమిషాల్లోనే వైరస్ నిర్ధరణ పరీక్ష కిట్లను రూపొందిస్తున్నాయి. ఈ ఆవిష్కరణలకు రాజకీయ నాయకుల నుంచి ప్రశంసలు వస్తున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం వీటి కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమయాన్ని లెక్కలోకి తీసుకుని రాపిడ్ టెస్టులను ప్రోత్సహిస్తే వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Virus test results in minutes
నిమిషాల్లోనే కరోనా పరీక్షలా? కచ్చితత్వం ఎంత?
author img

By

Published : Mar 29, 2020, 7:32 AM IST

Updated : Mar 29, 2020, 7:57 AM IST

చైనాలో పుట్టిన కరోనా వైరస్... ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అంతకంతకూ విస్తరిస్తూ వేలాది మంది ప్రాణాలను హరిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించడం, వైరస్ నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచడం కీలకమని అంటున్నారు విశ్లేషకులు. అప్పుడే వైరస్ సోకినవారిని తొందరగా వేరు చేయగలమని చెబుతున్నారు.

పలు ఔషధ కంపెనీలు వ్యాక్సిన్ తయారీపై నిమగ్నం కాగా మరికొన్ని సంస్థలు నిమిషాల్లో కరోనా వైరస్ ను నిర్ధరించే టెస్ట్ కిట్లను తయారు చేస్తున్నాయి. ఇలా నిమిషాల్లో ఫలితాలు వెలువరించే కిట్లపై ప్రపంచ రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వాటి విశ్వసనీయత, కచ్చితత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

35 లక్షల కిట్లకు ఆర్డర్..

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కరోనా వైరస్ రాపిడ్ టెస్ట్ కిట్ల ఆవిష్కరణను కొనియాడారు. వీటిని కరోనా సంక్షోభ సమయంలో 'గేమ్ ఛేంజర్'గా అభివర్ణించారు. ఈ వారంలో 35 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు.

వైరస్ సోకిందా లేదా అన్న విషయాన్ని వీటితో త్వరగా నిర్ధరించవచ్చని బ్రిటన్ చెబుతోంది. ఫలితంగా వైరస్ లేని వారికి క్వారంటైన్ నుంచి విముక్తి కల్పించి పనులకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వచ్చని చూస్తోంది. తద్వారా... స్తంభించిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలుగుతుందని భావిస్తోంది బ్రిటన్.

కానీ చాలా మంది శాస్త్రవేత్తలు ఈ పరీక్షల సరైన ఫలితాలు ఇస్తాయని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వాటి కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. లేదా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

పరీక్షలు ఇలా..

వైరస్ పరీక్షలు రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది యాంటిజెన్ టెస్ట్. అనుమానితుడి ముక్కు లేదా నోటిలోని స్రావాన్ని సేకరించి నిర్ధరించటం. రెండోది యాంటిబాడీ టెస్ట్.. రక్తాన్ని సేకరించి పరీక్షించటం.

కొన్ని నెలలుగా అనుమానితుడి నోటి స్రావాలతో వైద్యులు వైరస్ పరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్​లో శాస్త్రవేత్తలు ఈ స్రావాలలోని జన్యు పదార్థాన్ని వేరు చేసి కోట్లాది కణాలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి వైరస్​ను నిర్ధరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి ఒక్కోసారి కొన్ని రోజుల సమయం పడుతుంది.

నిపుణుల ఆందోళన..

రాపిడ్ యాంజిటెన్ పరీక్షల్లో తక్కువ స్రావాలను వినియోగిస్తారు. అదీ అనుమానితులే స్వయంగా ఇస్తారు. ఇవి ఫ్లూ టెస్ట్ తరహాలో 15 నిమిషాలలోపు ఫలితాన్ని ఇస్తాయి. ఈ పరీక్షల్లో యాంటిజెన్లపై దృష్టి పెడతారు. ఎందుకంటే వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో శరీరం యాంటిబాడీస్ (ప్రతినిరోధకాలు)ను ఉత్పత్తి చేస్తుంది.

చైనా, అమెరికా, మరికొన్ని దేశాలు టెస్ట్ ఫలితాలకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేశాయి. వీటిని విశ్లేషించి ఓ అభిప్రాయానికి వచ్చారు నిపుణులు. సుదీర్ఘ విధానంలో జరిగే పరీక్షలతో పోలిస్తే రాపిడ్ టెస్టుల్లో ఫలితాలు అంతగా నమ్మదగినవి కాదని అంటున్నారు.

స్పానిష్ శాస్త్రవేత్తల నివేదిక...

రాపిడ్ టెస్టుల్లో కచ్చితత్వం చాలా తక్కువని నిపుణుల అభిప్రాయం. కొన్ని ఫలితాలను విశ్లేషించిన స్పానిష్ శాస్త్రవేత్తలు.. వేగవంతమైన పరీక్షల్లో 30 శాతం కన్నా తక్కువగా కచ్చితత్వం ఉందని చెబుతున్నారు. అదే ల్యాబ్ పరీక్షల్లో 84 శాతం సరైన ఫలితాలు వస్తున్నాయని అంటున్నారు.

రాపిడ్ పరీక్షలు సాధారణ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయని స్పానిష్ సొసైటీ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండ్ క్లినికల్ మైక్రోబయాలజీ నివేదించింది. ఫలితంగా స్పెయిన్ ప్రభుత్వం తాజాగా 9 వేల రాపిడ్ టెస్ట్ కిట్లను తయారీదారుకు తిరిగి పంపింది. చైనా ప్రభుత్వం కూడా ఇటువంటి వాటిని అమ్మేందుకు ఎలాంటి లైసెన్సులు ఇవ్వలేదు.

యాంటిబాడీ పరీక్షల్లోనూ..

రక్త నమూనాలతో చేసే యాంటిబాడీ పరీక్షల్లోనూ ఇదే రకమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే కొంతమంది మాత్రం ఈ పరీక్షలు చాలా సమాచారాన్ని నిమిషాల్లో అందిస్తాయని వాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎవరు వ్యాధి బారిన పడ్డారు, ఎవరు వ్యాధికి రోగనిరోధక శక్తిని పొందారు.. ఒక సమాజంలో సంక్రమణ ఏ విధంగా ఉందో అని విస్తృత స్థాయిలో తెలుసుకునేందుకు యాంటిబాడీ పరీక్షలు చాలా విలువైనవిగా భావిస్తారు.

వీటికి సమాధానాలు లేవు..

ఫలితంగా యాంటిబాడీ పరీక్షలతో కరోనా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందనేది శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలరు. ఈ ఫలితాలు వ్యాక్సిన్ కనుగొనటంలో మార్గనిర్దేశం చేస్తాయని చెబుతున్నారు.

"కానీ చాలా విషయాలు ఇప్పటికీ అంతుచిక్కటం లేదు. ఈ యాంటిబాడీలు ఎంత కాలం జీవిస్తాయి? రోగనిరోధక శక్తి ఎంతమేరకు ఉంటుంది? ఎవరికి రక్త పరీక్షలు చేయాలి? ఇటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. "

- డాక్టర్ రాబిన్ పటేల్, అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ అధ్యక్షుడు

వారికి మరణమే!

కరోనా వైరస్ సోకిన వారిలో చాలామందికి తక్కువస్థాయి లేదా పరిమితమైన వ్యాధి లక్షణాలు ఉంటాయి. జ్వరం, దగ్గు వంటివి రెండు మూడు వారాలలో తగ్గిపోతాయి. ఎక్కువ మంది కోలుకుంటారు. మరికొందరు... ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతారు. న్యుమోనియా వచ్చే అవకాశాలూ ఉన్నాయి. తద్వారా మరణం సంభవించవచ్చు.

ఇదీ చూడండి: వీరికి కరోనా పరీక్షలు తప్పనిసరి!

Last Updated : Mar 29, 2020, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.