ఈ ఏడాది డిసెంబర్ 10న జరిగే నోబెల్ శాంతి బహుమతి ప్రదానం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. వేదికను కూడా ఓస్లో సిటీ హాల్ నుంచి ఓస్లో విశ్వవిద్యాలయానికి మార్చినట్లు నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
స్వీడన్‌లోని స్టాక్ హోంలో అదే రోజు భౌతిక, రసాయన, వైద్య, సాహిత్య రంగంలో బహుమతుల ప్రదానం జరగనుంది. ఈ వేడుకలనూ నిరాడంబరంగానే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతిని పురస్కరించుకుని 1901 నుంచి ఏటా డిసెంబర్ 10న ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. శాంతి బహుమతిని ఓస్లోలో, మిగతా విభాగాల వేడుకలను స్టాక్‌హోంలో నిర్వహిస్తారు. సాధారణంగా వెయ్యి మందిని ఈ వేడుకలను ఆహ్వానిస్తారు. అయితే, ఈ సారి ఆహుతులను వందకు కుదించారు.
ఈ ఏడాదికి గాను నోబెల్ శాంతి బహుమతి విజేతను అక్టోబర్ 9న ప్రకటించనున్నారు. మిగతా విభాగాల్లో విజేతలను అక్టోబర్ 5-12 మధ్య వెల్లడిస్తారు.
ఇదీ చూడండి: 'నోబెల్ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!