ETV Bharat / international

ఫ్రాన్స్​ ఆందోళనలు ఉద్రిక్తం.. 37 మంది పోలీసులకు గాయాలు

పోలీసులు, భద్రత సిబ్బంది చిత్రాలను ప్రదర్శించటాన్ని నేరంగా పరిగణిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ప్యారిస్​లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగి 37 మంది సిబ్బంది గాయపడ్డారు.

Violent protests in France
ఫ్రాన్స్​ ఆందోళనలు ఉద్రిక్తం
author img

By

Published : Nov 29, 2020, 5:56 AM IST

ఫ్రాన్స్​ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త జాతీయ భద్రత చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రజలు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనల్లో 37 మంది పోలీసులు గాయపడినట్లు ఆ దేశ అంతర్గత శాఖ మంత్రి గెర్లాండ్​ డార్మానిన్​ తెలిపారు. పోలీసులపై దాడులు చేపట్టటాన్ని ఖండించారు.

ఫ్రాన్స్​ ఆందోళనలు ఉద్రిక్తం

పోలీసుల చిత్రాలను ప్రదర్శించటం నేరంగా పరిగణించే ముసాయిదా చట్టానికి వ్యతిరేకంగా.. ఫ్రాన్స్​ దేశవ్యాప్తంగా ముఖ్యంగా పారిస్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టానికి గత మంగళవారం పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఆ వెనువెంటనే ప్రజల్లో ముఖ్యంగా జర్నలిస్ట్​ల్లో ఆగ్రహం చెలరేగింది. పారిస్​లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి.

పోలీసులు, భద్రత సిబ్బంది చిత్రాలను ప్రదర్శించటాన్ని నేరంగా పరిగణిస్తూ ఏడాది పాటు జైలు, 45 వేల యూరోల జరిమానా విధించేలా కొత్త చట్టంలో పొందుపరిచారు.

ఇదీ చూడండి: పాక్‌కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన ఫ్రాన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.