ETV Bharat / international

ఈ వీడియో చూస్తే టీకా కోసం క్యూ కడతారు! - టీకా న్యూస్

వ్యాక్సినేషన్​పై ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ రూపొందించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. టీకా తీసుకుంటే మునుపటిలా సాధారణ పరిస్థితులు ఎలా వస్తాయో దృశ్య రూపంలో చక్కగా వివరించారు. ఒక్కో టీకాతో జీవితం పునర్​ప్రారంభమవుతుందని దీనికి క్యాప్షన్​ పెట్టారు.

vaccine promotion video
ఈ వీడియో చూస్తే టీకా కోసం క్యూ కడతారు!
author img

By

Published : Jun 13, 2021, 7:56 AM IST

వ్యాక్సినేషన్​పై ప్రజల్లో ఉన్న అపోహలను పోగెట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అద్భుతమైన వీడియో రూపొందించింది. అందరూ టీకాలు వేసుకుంటే దుకాణాలు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్టేడియాలు తెరుచుకుని మునుపటిలా సాధారణ జీవనం పొందవచ్చని చక్కగా వివరించింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అప్లోడ్ చేసిన మూడు రోజుల్లోనే 3.3 మిలియన్ల మందికిపైగా దీన్ని వీక్షించారు. టీకా ఆవశ్యకతను గొప్పగా తెలియజేశారని కితాబిస్తున్నారు.

'ఒక్కో టీకాతో జీవితం పునర్​ప్రారంభమవుతుంది. అందరూ త్వరగా వ్యాక్సిన్​ వేయించుకోండి' అనే క్యాప్షన్​ను ఈ వీడియోకు జోడించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో ఇది వైరల్​ అయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.