2020లో ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను వినియోగించారని ఐక్యరాజ్య సమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ విభాగం (యూఎన్ఓడీసీ) నివేదిక తెలిపింది. వాటి వల్ల 3.6కోట్ల(13 శాతం) మంది ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు వెల్లడించింది.
కరోనా సంక్షోభం సమయంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం వీపరీతంగా పెరిగిపోయినట్లు తేలింది. సుమారు 77 దేశాల్లో ఆరోగ్య నిపుణులు సర్వే చేపట్టారు. ఆయా దేశాల్లో మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని.. 42 శాతం మంది తెలిపారు. అలాగే.. వైద్యానికి వినియోగించని ఫార్మా డ్రగ్స్ వాడకమూ పెరిగినట్లు తేలింది.
యూఎన్ఓడీసీ-2021 నివేదిక ప్రకారం..
- కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం గత 24 ఏళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. అదే సమయంలో 40శాతం మంది యువత మాత్రమే దీనిని హానికరంగా భావిస్తున్నారు.
- 15-64 మధ్య వయస్సుల వారిలో 5.5 శాతం మంది గతేడాది ఒక్కసారైనా డ్రగ్స్ వినియోగించారు.
- ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్లకు పైగా ప్రజలు డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు. వీరిలో సగం మంది.. మాదకద్రవ్యాల విపరీత వినియోగంతో వచ్చే వ్యాధి 'హెపటైటిస్-సీ'తో బాధపడుతున్నారు.
" అవగాహన లేమితోనే మాదకద్రవ్యాల వాడకం పెరిగిపోతోంది. వాటితో కలిగే దుష్ప్రభావాలపై యువతకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అవగాహన, వాస్తవికత మధ్య సంయమనం అవసరం."
-గడా వాలీ, యూఎన్ఓడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ఇవీ చదవండి: