బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్లో తెలిపారు. అయితే 2021 ప్రథమార్థంలోపు తాను భారత్ పర్యటనకు వస్తానన్నారు. జీ-7 సదస్సు కంటే ముందే తన పర్యటన ఉంటుందని మోదీకి బోరిస్ స్పష్టం చేసినట్లు బ్రిటన్ అధికార ప్రతినిధి తెలిపారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవానికి బోరిస్ ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.
బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నందున సోమవారం దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించింది యూకే ప్రభుత్వం.
ఇదీ చదవండి : కొత్త రకం కరోనాతో బ్రిటన్లో మళ్లీ లాక్డౌన్