UNESCO World Heritage Centre:ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది యునెస్కో. ప్రపంచ వారసత్వం కేంద్రం(వరల్డ్ హెరిటేజ్ సెంటర్) వెబ్సైట్లో.. భారత్కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఈమేరకు యునెస్కో(పారిస్)లో భారత శాశ్వత ప్రతినిధికి తెలియజేశారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ (డబ్ల్యూహెచ్సీ) డైరెక్టర్.
World Hindi Day: 2022, జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలను వర్చువల్గా నిర్వహించారు యునెస్కోలో భారత్ శాశ్వత ప్రతినిధి విశాల్ వీ శర్మ. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో హిందీ సాధించిన కీలక అంశాలు, దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే.. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి హాజరై ప్రసంగించారు. హిందీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
మరోవైపు.. ప్రపంచ హిందీ దినోత్సవ వేడుకలకు విద్యా, సామాజిక, సాంస్కృతిక, సమాచార, ప్రసారాల విభాగలకు చెందిన ప్రతినిధులు వీడియో సందేశాలు పంపారు. అలాగే.. అంగోలా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఈక్వెడార్, ఫ్రాన్స్ గ్రీస్, ఇరాన్, జపాన్, మంగోలియా, పాలస్తినా, కొరియా, రష్యా, శ్రీలంక, వియాత్నంలకు చెందిన యునెస్కోలో శాశ్వత ప్రతినిధులు వీడియో సందేశాలు పంపించి.. హిందీ ప్రాముఖ్యతపై మాట్లాడారు.
ఇదీ చూడండి: