అదనపు కొవిడ్ డోసులను కొనేముందు సంపన్న దేశాలు పునరాలోచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విజ్ఞప్తి చేసింది. దాని వల్ల పేద దేశాలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి చేస్తోన్న కృషి నీరుగారుతోందా? అనే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ధనిక దేశాల వద్ద ఇప్పటికే కోట్ల డోసులు ఉండగా.. వృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో తక్కువ లేదా అసలు డోసులే ఉండకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
కొవాక్స్ కార్యక్రమానికి సహకారం అందిస్తామన్న జీ7 దేశాలకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే మరిన్ని డోసుల కోసం తయారీదారులను సంపన్న దేశాలు ఆశ్రయించడం వల్ల కొవాక్స్పై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. మనతో పాటు మిగిలిన ప్రపంచం కూడా టీకా పొందినప్పుడే సురక్షితంగా ఉండగలమని చెప్పారు. వ్యాక్సిన్ను ఇతర దేశాలతో పంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ' 'కొవాక్స్' కోసం భారత్ 1.1 బిలియన్ డోసులు'