ETV Bharat / international

కరోనా టీకాపై రష్యాతో డబ్ల్యూహెచ్​ఓ చర్చలు - World Health Organization's Europe

రష్యా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్​పై సమగ్ర సమాచారం కోసం ఆ దేశంతో చర్చలు జరుపుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. టీకా​ అభివృద్ధిలో వేగం అవసరమైనప్పటికీ భద్రతా ప్రమాణాలను విస్మరించకూడదని స్పష్టంచేసింది.

UN: Discussions with Russia on COVID-19 vaccine under way
వ్యాక్సిన్​ అభివృద్ధిలో వేగం మంచిదే.. కానీ: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Aug 20, 2020, 7:34 PM IST

రష్యా కరోనా వ్యాక్సిన్​పై మరింత సమాచారం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆ దేశంతో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు ఐరోపాలోని డబ్ల్యూహెచ్​ఓ కార్యాలయం వెల్లడించింది.

వ్యాక్సిన్​ తయారీలో వివిధ దశలకు సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్​ఓ అధికారులు తెలుసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్​ అభివృద్ధిలో వేగం అవసరమైనప్పటికీ భద్రతా ప్రమాణాలను విస్మరించకూడదని పేర్కొంది.

వ్యాక్సిన్​ అభివృద్ధిని డబ్ల్యూహెచ్​ఓ స్వాగతిస్తుందని, అయితే అన్ని టీకాలకు ఒకే రకమైన క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించాలని సంస్థ(ఐరోపా​) డైరెక్టర్​ హాన్స్​ క్లూగ్ అన్నారు. ఎల్లో ఫీవర్​, పోలియో వంటి వాటికి టీకాను అభివృద్ధి చేసిన ఘనత రష్యాకు ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు క్లూగ్​.

శాశ్వత రోగనిరోధక శక్తికి ఆధారాల్లేవ్​..

కరోనా వ్యాక్సిన్​ను ఆమోదిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్​ పుతిన్ గత వారం​ ప్రకటించారు. అలా కరోనాకు తొలి వ్యాక్సిన్​ కనిపెట్టిన దేశంగా నిలిచింది రష్యా. కానీ ఈ వ్యాక్సిన్​.. అడ్వాన్స్​డ్​ క్లినికల్​ ట్రయల్స్​లో పాసైనట్లు తెలుపలేదు. తాము తయారుచేసిన కొవిడ్​-19 టీకా శాశ్వత రోగ నిరోధక శక్తిని అందిస్తుందని అధికారులు చెప్తున్నప్పటికీ.. ఎలాంటి ఆధారాలు లేవు. పరీక్షలను కూడా తక్కువ సంఖ్యలోనే నిర్వహించారు.

ఇదీ చదవండి: కరోనా, సాధారణ జలుబు మధ్య తేడా ఇదే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.