ETV Bharat / international

Air Quality: లాక్​డౌన్​లో మెరుగుపడిన గాలి నాణ్యత - గాలి నాణ్యత సమాచారం

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు ఏకతాటి మీదకు వచ్చి లాక్​డౌన్(Corona Lockdown)​ విధించడం వల్ల గాలిలో నాణ్యత(Air Quality) పెరిగిందని ఐరాస వాతావరణ సంస్థ చెప్పింది.

air quality
గాలి నాణ్యత
author img

By

Published : Sep 4, 2021, 6:44 AM IST

కరోనా ఉద్ధృతి కారణంగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ల వల్ల గాలి నాణ్యత(Air Quality) కొద్దికాలం పాటు మెరుగుపడిందని ఐరాస వాతావరణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించినట్లు తెలిపింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా ఈ మెరుగుదల కనిపించలేదని వివరించింది.

కొన్ని ప్రాంతాల్లో కాలుష్య కారకాల ఉత్పత్తి యాథావిధిగా సాగిందని, పలుచోట్ల అవి లాక్​డౌన్​కు(Corona Lockdown)​ ముందు కన్నా ఎక్కువగానే వెలువడ్డాయని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ సంస్థ (డబ్ల్యూఎంవో) శుక్రవారం ఓ బులిటెన్​ను విడుదల చేసింది.

వాయు నాణ్యతకు సంబంధించిన కొవిడ్​ ఒక అనూహ్య ప్రయోగంలా మారింది. దీనివల్ల కొన్ని చోట్ల తాత్కాలికంగా వాతావరణం మెరుగుపడింది. అయితే జనాభా, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రణాళికతో కూడిన ఓ కార్యాచరణ అవసరం. దానికి మహమ్మారులను ప్రత్యామ్నాయంగా భావించకూడదు.

-పెటెరి టాలస్​, డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్​

ప్రధాన కాలుష్య కారకాలైన సల్ఫర్​ డై ఆక్సైడ్​, నైట్రోజన్​ ఆక్సెడ్లు, కార్బన్​ మోనాక్సైడ్​, ఓజోన్​ కారణంగా వాయు నాణ్యతలో వచ్చిన మార్పులను ఈ సంస్థ పరిశోధించింది.

ఇదీ చూడండి: బ్రిటన్​ రాణి అంత్యక్రియలకు 'ప్లాన్'​.. కీలక పత్రాలు లీక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.