ETV Bharat / international

ఆక్స్‌ఫర్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి

ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ)ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆస్ట్రాజెనెకా-ఎస్​కేబయో తయారు చేస్తున్న కొవిషీల్డ్​కు అనుమతి ఇచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

UN approves AstraZeneca''s COVID-19 vaccine for emergency use
ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి
author img

By

Published : Feb 16, 2021, 5:38 AM IST

కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న కొవిషీల్డ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). భారత్​కు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన ఆస్ట్రాజెనెకా-ఎస్​కేబయో తయారు చేస్తోన్న కొవిషీల్డ్​​కు అనుమతి ఇచ్చినట్లు డబ్ల్యూహెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కరోనా టీకాలు అన్ని దేశాలకు చేరాలన్న డబ్ల్యూహెచ్​ఓ లక్ష్య సాధనకు దోహదపడుతుంది.

దీంతో వైరస్ విజృంభణతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొటున్న దేశాలు నిర్భయంగా ఆక్స్‌ఫర్డ్‌ టీకాలు దిగుమతి చేసుకునేందుకు డబ్ల్యూహెచ్​ఓ ఆదేశాలు దోహదం చేస్తాయి. బలమైన నియంత్రణ సంస్థలు లేని పేద, మధ్య ఆదాయ దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు డబ్ల్యూహెచ్​ఓ.. తాజా ఆదేశాలు ఉపకరిస్తాయని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్నారు. కొవాక్స్ పేరిట పేద దేశాలకు డబ్ల్యూహెచ్​ఓ వివిధ సంస్థలతో కలిసి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి: క్యాపిటల్ హింసపై '9/11' కమిషన్​తో దర్యాప్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.